కుప్పకూలిన విమానం.. 110 మంది మృతి..?
ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొలంబియాకు చెందిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో 110 మందికి పైగా మృతి చెందినట్లు స్పష్టం అవుతోంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కొలంబియాలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదంలో లాక్ హీడ్ మార్టిన్ హెరెకులెస్ ప్లేన్ సీ-130 ధ్వంసం అయింది. ఈ విషయాన్ని కొలంబియా డిఫెన్స్ మినిస్ట్రీ ధ్రువీకరించింది.
పెరూ సరిహద్దులోని పీయర్టో లెగుజామో ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అయిన సమయంలో అందులో 110 మందికిపైగా సైనికులు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే మరో కథనం ప్రకారం 57 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్యపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఘటనపై కొలంబియా డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో చెజ్ మాట్లాడారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారో తెలియాల్సి ఉందని ఈ మేరకు అధికారులు మృతుల సంఖ్యను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అందరూ బతికే ఉంటారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలంబియా మిలిటరీ విమానాలను మరింత అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి సంబంధిత అధికారులను శిక్షించాలని ఆదేశించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications