మాతృత్వం: బిడ్డ కోసం సింహంతో పోరాడింది!
కొలరాడో: ఓ మాతృమూర్తి తన కన్న బిడ్డను రక్షించుకునేందుకు ఏకంగా సింహంతోనే పోరాటం చేసింది. సింహాన్ని వెంబడించి, దాని నోటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న తన ఐదేళ్ల చిన్నారిని కాపాడుకుంది. కొలరాడోలోని అస్ఫెన్ పరిసరాల్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొలరాడోలోని అస్ఫెన్ పరిసరాల్లో బాధిత చిన్నారి, అతడి సోదరుడుతో ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా అరుపులు వినిపించడంతో వారి తల్లి బయటకు వచ్చిచూసింది. తన చిన్న కుమారుడు కొండల్లో సంచరించే సింహం నోటిలో చిక్కుకోవడం చూసి నిశ్చేష్టురాలైంది.

వెంటనే తేరుకుని సింహాన్ని వెంబడించింది. బలవంతంగా సింహం నోటిని తెరచి దాని నుంచి చిన్నారిని విడిపించింది. అనంతరం ఒక్క ఉదుటన పరుగు లంకించుకొని బిడ్డతో సహా ప్రాణాలతో బయటపడింది.
అయితే సింహం నోటబట్టడంతో బాలుడి తల, మొహం, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. అతడి తల్లికి సైతం సింహం గోరు గాట్లు, పళ్ల గాట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వారిద్దరినీ డెన్వర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కన్న బిడ్డ కోసం ఇంతటి సాహసం చేసిన ఆమె ఒక 'హీరో' అంటూ అధికారులు ప్రశంసించారు. కాగా, దాడికి పాల్పడిన సింహాన్ని పోలీసులు హతమార్చారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications