అయిదు గంటల హైటెన్షన్: సూపర్‌మార్కెట్‌లో కాల్పులు: పోలీస్ అధికారి సహా పలువురి మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోమరోసారి గన్ కల్చర్ పెచ్చరిల్లింది. పలువురిని బలి తీసుకుంది. అట్లాంటాలో స్పా, మసాజ్ సెంటర్‌పై ఆసియన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈ సారి సూపర్ మార్కెట్‌కు వచ్చిన కొనుగోలుదారులను టార్గెట్‌గా చేసుకుని అహ్మద్ అల్ అలీవి అలీస్సా అనే 21 ఏళ్ల యువకుడువ్యక్తి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియ రాలేదు. మృతుల్లో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు స్పష్టమైంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవరం సాయంత్రం కొలరాడోలోని బౌల్డర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బౌల్డర్‌లోని కింగ్ సూపర్స్ గ్రోసరీ స్టోర్‌లోకి తుపాకీతో ప్రవేశించిన ఓ వ్యక్తి.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4:20 నిమిషాలకు తొలిసారిగా బౌల్డర్ పోలీసులు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు.

టేబల్ మిసా, బ్రాడ్‌వేలో గల కింగ్ సూపర్స్ గ్రోసరీ స్టోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే పలువురు పోలీసులు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. సూపర్ మార్కెట్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సూపర్ మార్కెట్ ఆవరణలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఆగంతకుడిని లొంగిపోవాలంటూ పలుమార్లు హెచ్చరించారు. హెచ్చకలను కొనసాగిస్తూనే సహాయక చర్యలను చేపట్టారు.
సూపర్ మార్కెట్‌లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటికి తరలించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించారు. కొందరిని రక్షించగలిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. కాల్పులకు తెగబడిన వ్యక్తిని ప్రాణాలతో అరెస్ట్ చేసినట్లు బౌల్డర్ పోలీస్ కమాండర్ కెర్రి యమగుచి తెలిపారు. అరెస్ట్ చేసే ప్రయత్నంలో అతణ్ని గాయపర్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆగంతకుడిని ఆసుపత్రికి తరలించామని, అతని పేరు, ఇతర వివరాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. సూపర్ మార్కెట్‌లో ముగ్గురు, డోర్ వద్ద ఒకరు, పార్కింగ్ ప్లేస్‌లో ఇద్దరు నేలపై పడి ఉన్నట్లు గుర్తించామని యమగుచి తెలిపారు. మృతుల్లో ఒకరు బౌల్డర్ పోలీస్ అధికారి ఉన్నారని స్పష్టం చేశారు. కాల్పులకు తెగబడటానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు. గాయపడిన ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
2,700 డిగ్రీల సెల్సియస్ వేడి మధ్య.. అమెరికా తీరంలో స్ప్లాష్ డౌన్ -
Canada పౌరసత్వం.. మీ తాతల వారసత్వంతో సాధ్యం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు.











Click it and Unblock the Notifications