వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంప్యూటర్ సైంటిస్ట్.. కట్-కాపీ-పేస్ట్ సృష్టికర్త కన్నుమూత..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్, కట్.. కాపీ.. పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్(74) కన్నుమూశారు. ఆయన మృతిని Xerox కంపెనీ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. విప్లవాత్మక ఆలోచనలతో ఆయన అందించిన సాంకేతికతకు కృతజ్ఞతలు తెలుపుతూ నివాళి అర్పించింది. టెస్లర్ తన కెరీర్‌లో ఎక్కువ కాలం ఆ కంపెనీతోనే పనిచేశారు.

టెస్లర్ గురించి..

టెస్లర్ గురించి..

అమెరికాలోని న్యూయార్క్‌,బ్రోంక్స్‌లో 1945లో టెస్లర్ జన్మించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కంప్యూటర్ పనితీరును మరింత సులభతరం చేసే
యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌లో స్పెషలైజేషన్ చేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ప్రముఖ సంస్థలతో ఆయన పనిచేశారు. జిరాక్స్ పాలో అల్టో రీసెర్చ్ సెంటర్(Parc)తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో యాపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్‌తో కలిసి ఆ కంపెనీ కోసం పనిచేశారు. అక్కడ దాదాపు 17 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన... చీఫ్ సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు.

 అప్పటినుంచి పాపులర్..

అప్పటినుంచి పాపులర్..

యాపిల్ నుంచి బయటకొచ్చాక లారీ టెస్లర్ సొంతంగా ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. మధ్యలో కొంతకాలం అమెజాన్,యాహూ కంపెనీలతోనూ పనిచేశారు. పాత రోజుల్లో పేపర్ క్లిప్స్‌ను కత్తిరించి.. వాటిని మరో చోట అతికించే విధానాన్ని స్పూర్తిగా తీసుకుని.. కట్.. కాపీ.. పేస్ట్ సాంకేతికతను అభివృద్ది చేశారు. 1983లో యాపిల్ సంస్థ లిసా కంప్యూటర్‌‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఆ తర్వాత ఏడాదిలో దాని ఒరిజినల్ వెర్షన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాతే టెస్లర్ పేరు బాగా పాపులర్ అయింది.

Recommended Video

US House Votes To Clip Trump's Wings On Iran || Oneindia Telugu
బ్రౌజర్‌ను సూచించింది కూడా టెస్లరే..

బ్రౌజర్‌ను సూచించింది కూడా టెస్లరే..

బ్రౌజర్ అనే పదాన్ని కూడా అప్పట్లో లారీ టెస్లరే సూచించినట్టు చెబుతారు. అంతేకాదు, కంప్యూటర్‌కి సంబంధించి 'మోడ్‌లెస్' విధానాన్ని అభివృద్ది చేయడంలో ఆయన చాంపియన్ అని చెబుతారు. టెస్లర్,అతని స్నేహితుడు కలిసి PARCలో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్‌పై పనిచేస్తున్నప్పుడు దీన్ని అభివృద్ది చేశారు.

English summary
A pioneering US computer scientist whose accomplishments included inventing the widely relied on "cut, copy and paste" command died at age 74.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X