కారులో పార్ట్‌నర్‌కి ముద్దు: వేశ్యగా భావించి నటి అరెస్ట్
లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ పోలీసులు పొరబడ్డారు! ఆస్కార్ నామినేటెడ్ సినిమా డిజాంగో అన్‌చైన్డ్ సినిమాలో నటించిన ఆఫ్రికన్ - అమెరికన్ నటి డానియెలే వాట్స్‌ను వ్యభిచారిణిగా భావించి అదుపులోకి తీసుకున్న ఘటన అమెరికాలో జరిగింది. వాట్స్, ఆమె శ్వేతజాతి పార్ట్‌నర్ బ్రయాన్ జేమ్స్ లూకాస్ కారులో సన్నిహిత స్థితిలో ఉన్నారు. అతనికి కారులో ముద్దు ఇచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు వాట్స్‌ను, బ్రయాన్ లూకాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె నటి అని తెలుసుకున్న పోలీసులు, అనంతరం, విడిచి పెట్టారు.

వాట్స్ చేతులకు హ్యాండ్ కఫ్స్ తగిలించి పోలీసులు తీసుకుని వెళ్లారు. వాట్స్ ఓ టీవీతో ఈ వివరాలను పంచుకుంది. పోలీసులు తన ఫోటో ఐడీని అడిగితే తాను నిరాకరించానని ఆమె తెలిపింది. దీంతో వారు తనకు హ్యాండ్ కఫ్స్ తగిలించి తీసుకు వెళ్లారని తెలిపింది. ఆమెకు హ్యాండ్ కఫ్స్ తగిలించడంతో ఆమె మణికట్టుకు ఒకింత గాయం కూడా అయింది.
కాగా, పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో, తాను ఏడ్చిన ఫోటోను వాట్స్ ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసింది. తాను పోలీసు జీపులో వెనుక సీట్లో కూర్చున్నానని, ఆ సమయంలో... తన తండ్రి ఏ తప్పు చేయకపోయినా పోలీసుల చేత ఇబ్బందులు పడిన సంఘటన గుర్తు చేసుకున్నానని పేర్కొంది.












Click it and Unblock the Notifications