10 లక్షలు దాటిన మరణాలు, అమెరికాలోనే 2 లక్షలు.. భారత్‌లో లక్షకు చేరువలో..
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గా ఉంది. అయితే వీరిలో 2 కోట్ల 28 లక్షల పై చిలుకు మంది వైరస్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల అంశం. పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత భారత్, బ్రెజిల్ ఉన్నాయి.

10 లక్షలు దాటిన మరణాలు..
కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న రికవరీ కూడా పెరగడం కాస్త రిలీఫ్ ఇచ్చింది. అయితే మరణాలు మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3 వేల 837 మంది చనిపోవడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో మృతిచెందిన మొత్తం సంఖ్య 10 లక్షలు దాటింది. 10 లక్షల 6 వేల 329 మంది చనిపోయారు. అయితే దానిని డేటాలో 10 లక్షల 6 వేల 129గా కూడా చూపిస్తోంది. దీంతో చనిపోయిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. వైరస్ విజృంభిస్తోన్న 7 నెలల్లోనే మృతుల సంఖ్య మిలియన్ దాటింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ రాలేదు. దీంతో మరిన్ని మరణాలు సంభవిస్తాయనే ఆందోళన నెలకొంది.

2 లక్షల పైచిలుకు కేసులు
సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 30 వేల 547 మందికి వైరస్ సోకింది. ఇటు అమెరికాలో మొత్తం కరోనా కేసులు 7.3 మిలియన్‌గా ఉంది. అయితే మరణాలు 2 లక్షల దాటడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకురావాలనే ధృడ నిశ్చయంతో అగ్రరాజ్యం ఉంది. ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌కు వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ చెబుతున్నారు.

ఇండియాలో కూడా
ఇటు ఇండియాలో కూడా కరోనా కేసులు ఎక్కవగానే ఉన్నాయి. అయితే మరణాలు కూడా ఎక్కువ రావడం టెన్షన్ కలిగిస్తోంది. సోమవారం నాటికి చనిపోయిన వారి సంఖ్య 96 వేల 351గా ఉంది. పాజిటివ్ కేసుల్లో కూడా దేశం రెండో ప్లేస్‌లో ఉంది. అమెరికా కన్నా దాదాపు మిలియన్ తక్కువ కేసులు ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో అమెరికాను దాటుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications