వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా తో ఫైటింగ్, ఆసుపత్రి బిల్లు రూ. 9 కోట్లు, కోమాలోకి, ఎందుకు బతికాను రా దేవుడా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ అమెరికా: ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను కరోనా వైరస్ (COVID 19) ఫుట్ బాల్ ఆడుకుంటోంది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వృద్దుడికి కరోనా వైరస్ సోకింది. కరోనా వ్యాధి సోకడంతో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించి వ్యాధి నయం చేసి డిశ్చార్జి చేసి ఇంటికి పింపించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వృద్దుడి కుటుంబ సభ్యులు బిల్లులు చెల్లించారు.

ఇంటికి వెళ్లిన వృద్దుడికి ఆసుపత్రి యాజమాన్యం ఫైనల్ బిల్లు పంపించింది. అంతే ఆసుపత్రి బిల్లు చూసిన కరోనా పేషంట్ కు కోమాలోకి వెళ్లినట్లు అయిపోయింది. కరోనా చికిత్సకు మీకు అయిన ఆసుపత్రి బిల్లు కేవలం రూ. 9 కోట్లు మాత్రమే అని 181 పేజీల బిల్లు పంపించారు. కరోనా తో పోరాటం చేసి బతికినందుకు ఈ బిల్లు చూసి నిజంగానే చచ్చినంత పని అయ్యిందని ఆ వృద్దుడు లబోదిబో అంటున్నాడు.

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?

అమెరికాలో కరోనా కాటు

అమెరికాలో కరోనా కాటు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ 21 లక్షల మందికిపైగా సోకింది, కరోనా వైరస్ దెబ్బకు 1 లక్షా 17 వేల మందికిపైగా చనిపోవడంతో 6 లక్షల 54 వేల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.

అయ్యో.... మేము ఏం చెయ్యలేం

అయ్యో.... మేము ఏం చెయ్యలేం

అమెరికాలోని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్న మైకెల్ (70) అనే వృద్దుడికి కరోనా వైరస్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మార్చి 4వ తేదీన స్టడిక్ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా వైరస్ ముదిరిపోయిందని, మైకెల్ ను కాపాడటం సాధ్యం కాదని మొదట వైద్యులు చెప్పారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో మైకెల్ కరోనా వైరస్ నుంచి కోలుకోవడం మొదలుపెట్టారు.

వచ్చాడయ్యా సామి, ఫుల్ హ్యాపి

వచ్చాడయ్యా సామి, ఫుల్ హ్యాపి

మార్చి 4వ తేదీ నుంచి కరోనా వైరస్ తో పోరాటం చేసిన మైకెట్ ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. మైకెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు చెప్పినంత డబ్బులు మైకెల్ కుటుంబ సభ్యులు చెల్లించారు. కరోనా వైరస్ పూర్తిగా నయం కావడంతో మే 5వ తేదీన మైకెల్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కరోనా వైరస్ వ్యాధి నయం కావడంతో ఇంటికి వెళ్లిన మైకెల్ ను చూసిన ఆయన కుటుంబ సభ్యులు చాల సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.

హల్ మైకెల్ గారు... ఇది ఫైనల్ బిల్లు

హల్ మైకెల్ గారు... ఇది ఫైనల్ బిల్లు

కరోనా వైరస్ కారణంగా అమెరికాలో లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సమయంలో వ్యాధి నయం చేసుకుని ఇంటికి వెళ్లిన మైకెల్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉన్నారు. అయితే ఆ సంతోషం ఆయన్ను ఎక్కువ సమయం ఉండనివ్వలేదు. కోరియర్ లో మైకెల్ కు ఆసుపత్రి నుంచి ఫైనల్ బిల్లు వెళ్లింది. ఆసుపత్రి నుంచి వచ్చిన ఫైనల్ బిల్లు ఏకంగా 181 పేజీలు ఉన్నాయి.

Recommended Video

China Reports New COVID-19 Cases Again!
కోమాలోకి వెళ్లినట్లు అయ్యింది

కోమాలోకి వెళ్లినట్లు అయ్యింది

ఆసుపత్రి నుంచి వెళ్లిన ఫైనల్ బిల్లు చూసిన మైకెల్ కు ఇప్పుడు కోమాలోకి వెళ్లినంత పని అయ్యింది. 181 పేజీ బిల్లు అటూ ఇటూ తిరగేసి చూసిన మైకల్ నేను నిజంగా ఎందుకు బతికాను రా దేవుడా ? అని అనిపిస్తోందని లబోదిబో అన్నాడు. కరోనా వైరస్ చికిత్స కోసం మీకు ఇంత వరకు రూ. 8 కోట్ల 37 లక్షలు అయ్యింది, ఇప్పుడు చెల్లించిన సోమ్ము కాకుండా మిగిలిన సోమ్ము చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి. 70 ఏళ్ల వయసులో కరోనా వైరస్ ను జయించినందుకు సంతోషపడాలా ? లేక ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నన్ను బతికించినందుకు భాదపడాలో అర్థం కావడం లేదని మైకెల్ లబోదిబో అంటున్నారు. ఈ వయసులో తనకు ఇంత డబ్బులు ఖర్చు చేసి బతికించి ఇప్పుడు అప్పులు తీర్చలేక నన్ను నిజంగానే చంపేస్తున్నారని మైకెల్ వాపోతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
Coronavirus: He may have recovered from the deadly coronavirus, but the hospital bill left him reeling in shock. Yes! A 70-year-old man in the US, who nearly died from the coronavirus, was taken aback after he was given a whopping USD 1.1 million bill for his medical expense.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X