Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!
న్యూయార్క్: చైనాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్. రెక్కలు చాచింది. తన పరిధిని విస్తరించుకుంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి.. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఖండాంతరాలను దాటుకుంటోంది. ఇప్పటికే 13 దేశాల్లో కరోనా వైరస్ కేసులు కనిపించాయి. మరి కొన్ని దేశాల్లో దీనికి సంబంధించిన జాడలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర అమెరికా మొదలుకుని ఆసియా వరకూ కరోనా వైరస్ కేసులు నమోదువుతున్నాయి.

వుహాన్ సిటీలో 3,554 కేసులు..
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో ఇప్పటిదాకా 3,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. పదుల సంఖ్యలో స్థానికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. వాటిని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. చైనాకు పొరుగునే ఉన్న దక్షిణ కొరియా-4, జపాన్-7, థాయ్‌లాండ్-14, వియత్నాం-2, కాంబోడియా-1, మలేసియా-7, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-2, శ్రీలంక-1, సింగపూర్-7, ఆస్ట్రేలియా-5, జర్మనీ-4, ఫ్రాన్స్-4, అమెరికా-5, కెనడాలో ఒక కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో అయిదు కేసులు..
అమెరికాలో వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసు నమోదు కాగా.. కాలిఫోర్నియాలో ఇద్దరిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినప్పటికీ.. అవి పెద్దగా ఫలితాలనివ్వట్లేదని అంటున్నారు. కరోనా వైరస్ లక్షణాలు గల ప్రయాణికులను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

చైనాలో 130కి చేరిన మృతుల సంఖ్య..
ఇదిలావుండగా.. చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఆరంభంలో 52 మంది మరణించారు. క్రమంగా ఈ సంఖ్య 130కి చేరుకుంది. ఈ వైరస్ బారిన పడిన పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్ రూపుమాపడానికి అవసరమైన మందులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. దీనికి అవసరమైన మందుల కోసం చైనా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది..












Click it and Unblock the Notifications