Corrupt Countries: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

Corrupt Countries: ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను ప్రతి సంవత్సరం "ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ "విడుదల చేస్తుంది. ఈ సంస్థ అంతర్జాతీయంగా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మంగళవారం(ఫిబ్రవరి 11) నాడు అవినీతి సూచిక 2024(కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI))ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగంలో అవినీతి ఎంతవరకు ఉందో సంబంధిత నిపుణులు, వ్యాపారవేత్తలు అంచనా వేస్తారు. దాని ఆధారంగా దేశాలకు స్కోరును ఇస్తారు. ఆ స్కోర్ ఆధారంగా ఈ సూచికను రూపొందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఒక తీవ్రమైన, ప్రమాదకరమైన సమస్యగా కొనసాగుతున్నట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించిన ఈ సూచికలో.. 0 నుంచి 100 వరకు స్కోర్లు ఉంటాయి. ఆ స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించబడుతుంది. ప్రభుత్వ రంగంలో చోటుచేసుకున్న అవినీతి ఆధారంగా సీపీఐ అవినీతి స్థాయిని సున్నా(అత్యంత అవినీతి) నుంచి 100(అస్సలు అవినీతి లేనిది) స్కోరు ఇచ్చింది.

అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలు
ఈ సూచిక ప్రకారం.. ఈ జాబితాలో డెన్మార్క్ వరుసగా ఏడో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత అవినీతి రహిత దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది. సీపీఐ ఇండెక్స్ లో ఆ దేశానికి 90 స్కోరు లభించింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్(88), సింగపూర్(84), న్యూజిలాండ్(83) దేశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్(81), నార్వే(81), స్విట్జర్లాండ్(81), స్వీడన్(80), నెదర్లాండ్స్(78), ఆస్ట్రియా(77) చోటు సంపాదించుకున్నాయి.

Corruption Perception Index 2024 India Ranks 96th Out of 180 Countries

అత్యంత అవినీతి దేశాలు
మొత్తం ప్రపంచ జనాభాలో(8 బిలియన్లు)8గ5 శాతం లేదా దాదాపు 6.8 బిలియన్ల మంది ప్రజలు సీపీఐ స్కోరు 50 కంటే తక్కువ ఉన్న దేశాలలోనే నివసిస్తున్నారు. ఈ సూచిక ప్రకారం.. దక్షిణ సూడాన్ అత్యంత అవీనితి దేశంగా ర్యాంక్ పొందింది. ఈ దేశం 8 పాయింట్ల స్కోరుతో సీపీఐ సూచికలో అట్టడుగున ఉంది. అత్యంత అవినీతి దేశాల జాబితాలో దక్షిణ సూడాన్ తర్వాత సోమాలియా(9), వెనిజులా(10), సిరియా(12), లిబియా(13), ఎరిట్రియా(13), యెమెన్(13), ఈక్వటోరియల్ గినియా(13) ఉన్నాయి.

భారత్ స్థానం ఎంత.. స్కోరు ఎంత?
సీపీఐ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 38 స్కోరుతో 96 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే భారత్ లో అవినీతి పెరిగినట్లు ఈ సూచి ప్రకారం తెలుస్తోంది. గతేడాది భారత్ 39 స్కోరుతో 93వ స్థానంలో నిలవగా.. ఈ సారి మూడు స్థానాలు దిగజారి 96కు చేరింది. భారతదేశం 2023లో 39, 2022లో 40 స్కోరును పొందింది. గత 10 సంవత్సరాల భారత గణాంకాలను పోలిస్తే దేశంలో అవినీతి పెరిగిపోయింది. 2014లో భారత్ 85వ స్థానంలో ఉండగా.. పదేళ్లలో భారత్ 11 స్థానాలు దిగజారి 96వ స్థానానికి చేరుకుంది.

సీపీఐ ఇండెక్స్ 2023 నివేదికలో భారతదేశం 39 స్కోరుతో 93వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదని నివేదిక తెలిపింది. 2022లో ఇండియా ఓవరాల్ స్కోర్ 40 కాగా, 85వ ర్యాంకులో ఉంది. పాకిస్థాన్ 29, శ్రీలంక 34 ర్యాంకులతో ఉన్నాయి. ప్రపంచబ్యాంక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ప్రైవేట్ రిస్క్, కన్సెల్టింగ్ కంపెనీలు, థింక్ ట్యాంకులు సహా మరో 13 ఇతర వనరుల నుంచి డేటాను సేకరించి ట్రాన్స్‌పరెన్స్ ఇంటర్నేషనల్ ఈ నివేదికను విడుదల చేసింది.

పొరుగు దేశాలలో అవినీతి స్థితి
భారత పొరుగు దేశాలలో చైనా 43 పాయింట్లతో 76వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 2023లో 133వ స్థానంలో ఉండగా.. తాజా సూచికలో దాని ర్యాంకింగ్ 2 పాయింట్లు తగ్గి 135కి చేరుకుంది. పాకిస్థాన్ 2024లో కేవలం 27 పాయింట్లు మాత్రమే సాధించింది. గతేడాది పాకిస్థాన్ పాయింట్లు 29 మాత్రమే. శ్రీలంక ర్యాంకింగ్ 121వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ లో కూడా అవినీతి పెరిగి 149వ స్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పనిచేయడంలో అవినీతి ఒక ప్రధాన అడ్డంకిగా మారుతోందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. రికార్డు స్థాయిలో గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యంలో క్షీణత, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు నాయకత్వంలో క్షీణత ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. అవినీతి ఆ పోరాటాన్ని మరింత కష్టతరం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+