Stormy Daniel: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు కోర్టులో ఎదురు దెబ్బ.. లక్షా 20 వేల డాలర్లు చెల్లించాలంటూ..
అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్టార్మీ డేనియల్స్ పై పరువునష్టం దావా వేసి ఓడిపోయింది. 9వ US సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కోర్టు స్టార్మీ డేనియల్స్ కు ఫైన్ విధించింది. ట్రంప్ న్యాయవాదులకు 120,000 డాలర్ల లీగల్ ఫీజుగా చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించింది. ఆమె ఇప్పటికే చెల్లించాలని కోర్టు ఆదేశించిన దాని కంటే ఇది $500,000 కంటే ఎక్కువ. కాగా స్టార్మీ డేనియల్స్ అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టై విడుదలైయ్యారు.
అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో ఆయనపై నమోదైన అభియోగాలపై న్యూయార్క్ కోర్టులో ఆయనపై విచారణ జరుగుతోంది. పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి తనను బెదిరించాడని డేనియల్స్ చేసిన ఆరోపణపై డేనియల్స్ 2018లో ట్రంప్‌పై దావా వేశారు. అక్టోబర్ 2018లో వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. డానియల్స్‌ను న్యాయపరమైన రుసుములలో సుమారు $293,000 చెల్లించమని ఆదేశించింది. ఆయితే ఆమె అప్పీల్‌కు వెళ్లడంతో $245,000 తగ్గించింది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.

దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనేది ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును విచారించిన మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. స్టార్మీ డేనియల్స్ అసలు పేరు- స్టెఫానీ క్లిఫొర్డ్. లూసియానా స్టేట్‌లోని బ్యాటన్ రూజ్ ఆమె స్వస్థలం. సుదీర్ఘకాలంగా ఆమె పోర్న్ మూవీల్లో నటిస్తోన్నారు.
సుమారు 20 సంవత్సరాలుగా ఆమె అడల్ట్ ఫిల్మ్స్‌లల్లో నటిస్తోన్నారు. పోర్న్ మూవీలకు దర్శకత్వం వహించారు.
మాజీ స్ట్రిప్పర్ కూడా. నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు షెయ్లా, బిల్ గ్రెగరీ విడిపోయారు. దీనితో తల్లి వద్ద పెరిగారు. బ్యాటన్ రూజ్‌లోని స్కాట్లాండ్‌విల్లే మాగ్నెట్ హైస్కూల్‌లో చదివారు. 2004లో అడల్ట్ మూవీల్లో నటించడం మొదలుపెట్టారు. పలు పోర్న్ మూవీల్లో నటించారు. అడల్ట్ ఫిల్మ్ బిజినెస్‌లో స్థిరపడ్డారు. ట్రంప్‌తో ఏర్పడిన పరిచయం, రిలేషన్‌షిప్‌పై 2018లో తొలిసారిగా స్టార్మీ డేనియల్స్ స్పందించారు.












Click it and Unblock the Notifications