ఖమేనీ చివరి సంచలన మెసేజ్- ఇన్ ద నేమ్ ఆఫ్.. అంటూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది.

"చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన ఖమేనీ మరణించాడు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ప్రపంచదేశాలు, ప్రజలకు న్యాయం జరిగింది.." అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ కూడా దీన్ని నిర్ధారించింది. ఇదే సమాచారాన్ని ట్వీట్ చేసింది. తమ దేశాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇరాన్ ప్రజలకు గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ చెప్పారు. ఖమేనీ మరణించిన తర్వాత కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

Cryptic Persian Message Invoking In the Name of Haidar Appears on Khamenei X After Trump Breaks News

ఖమేనీ తమ ట్రాకింగ్ వ్యవస్థల నుండి తప్పించుకోలేకపోయారని, ఎట్టకేలకు దొరికిపోయారని తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి పని చేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమయ్యారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెవల్యూషనరీ గార్డ్, భద్రతా దళాలు ఇప్పుడు చావు కోసం ఎదురు చూస్తోన్నాయని హెచ్చరించారు. వారికి మరణం తప్పదనీ వ్యాఖ్యానించారు.

మరణించే సమయానికి ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నట్లు తేలింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ఆరంభం కావడానికి కొద్దిసేపటి ముందు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ సైతం పెట్టారాయన. ఖమేనీ మరణ వార్తను ట్రంప్ ప్రకటించిన వెంటనే ఖమేనీ ఎక్స్ అకౌంట్ నుండి ఈ మెసేజ్ పోస్ట్ అయింది.

పర్షియన్ భాషలో ఉందా పోస్ట్. షియా ఇస్లాంలో మొదటి ఇమామ్ హైదార్ పేరును ప్రస్తావించింది. "బే నామ్‌-ఎ నామీ-యే హైదర్, అలైహిస్-సలామ్" అని రాసి ఉంది. గౌరవనీయమైన హైదర్ పేరుతో ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక.. అనేది దీని అర్థం. ఖమేనీ మరణవార్త వెలువడిన కొద్దిసేపటికే ఈ ట్వీట్ వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన చనిపోయారనే విషయాన్ని సుప్రీమ్ లీడర్ ఆఫీస్ అధికారికంగా వెల్లడించినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+