డల్లాస్ లో వేర్వేరు చోట్ల భీకర కాల్పులు.. నలుగురు మృతి, 15 మందికి సీరియస్

డల్లాస్ లోని డీప్ ఎల్లమ్ నైబర్ హుడ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 75 నిమిషాల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో తీవ్రమైన కాల్పుల ఘటనలు జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఘటనలు ఎల్మ్ స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ అలాగే సౌత్ క్రౌడస్ స్ట్రీట్ లో జరిగాయి. ఈ ఘటనపై పోలీస్ చీఫ్ డానియల్ కామియెక్స్ మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందారని వివరించారు. అలాగే 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి అని పేర్కొన్నారు. అయితే గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

"ఈ ఘటన పూర్తిగా ఆమోదయోగ్యం కానిది. స్వాగతించలేనిది. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. హాలోవీన్ వీకెండ్‌ సందర్భంగా అమెరికాలో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ఎందుకు మొదలయ్యాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ కాల్పులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం" అని పోలీస్ చీఫ్ డానియల్ కామియెక్స్ పేర్కొన్నారు.

Dallas shooting Violent shootings at multiple locations in Dallas four dead 15 in serious condition

ఇక ఏటా అక్టోబర్ చివరివారంలో ముఖ్యంగా అక్టోబర్ 31 న ఈ హాలోవీన్ వేడుకలు జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో గుమ్మడికాయలతో అలంకరణలు చేస్తుంటారు. అలాగే దెయ్యాలు.. రాక్షసుల వేషధారణలు వేస్తారు. ఇక కాస్ట్యూమ్ పార్టీలు.. నైట్ క్లబ్ వేడుకలు జరుగుతుంటాయి. అలాగే హాంటెడ్ హౌజ్ లు.. వినోదభరితమైన ఉత్సవాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇలాంటి వేడుకల్లో కాల్పుల ఘటనలు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+