US elections: ట్రంప్ గెలుపుపై హాట్ డిబేట్.. మహిళలకు వరమా, శాపమా?
Donald Trump: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు తెలిపిన మహిళలు తమ స్వంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓటు వేశారని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఎందుకంటే కమలా హారిస్‌ను తిరస్కరించడం ద్వారా 250 ఏళ్ల చరిత్రలో మొదటి మహిళా నాయకురాలిగా మారే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. అందుకు బదులుగా మహిళల పట్ల వ్యతిరేక అభిప్రాయాలు కలిగినట్లు చెబుతున్న ట్రంప్‌ను రెండోసారి కూడా ఎన్నుకున్నారు. ఈ ఫలితంపై చాలా మంది మహిళలను షాక్‌కు గురిచేసినట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఎన్నికల ఫలితాలు వివిధ వర్గాలలోని మహిళల మధ్య తీవ్రమైన విభజనలను హైలైట్ చేశాయి. ట్రంప్ 45 శాతం మహిళా ఓటర్ల మద్దతు పొందారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వర్ణం ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపాయి. గతంలో హిల్లరీ క్లింటన్ తో పాటు ప్రస్తుతం కమలా హారిస్ తిరస్కరణ అమెరికన్లలో ఫెమినిజం పట్ల వ్యతిరేకతను ప్రతిబింబిస్తుంది.

ట్రంప్ ఎన్నికను కన్జర్వేటివ్ ఆర్గనైజేషన్ మామ్ ఫర్ లిబర్టీ సహ వ్యవస్థాపకురాలు టిఫనీ జస్టిస్ మహిళలకు ఒక సానుకూల అడుగుగా భావిస్తున్నారు. ఇదే నిజమైన అమెరికన్ ఫెమినిజం అని చెబుతున్నారు. సుజీ వైల్స్‌ను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించడం వంటి నిర్ణయాలు మహిళలకు మంచివి అని నమ్ముతున్నట్లు చెప్పారు. ట్రంప్ తీసుకునే చర్యలు మహిళల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కేవలం ప్రధాన మీడియాలో వినిపించేవి మాత్రమే కాకుండా వాస్తవాన్ని గమనించాలని సూచిస్తున్నారు.
ఎన్నిక అనంతరం మహిళలు రాజకీయ కోణంలో రెండుగా చీలిపోయారనే ఆరోపణలపై టిఫనీ స్పందించారు. 2016లో జరిగిన మిలొ యునైటెడ్ ర్యాలీ లాంటివి ఈసారి కనిపించలేదన్నారు. లిబరల్ మహిళలు తమ కన్జర్వేటివ్ సహచరులను విమర్శిస్తూ, ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు కన్జర్వేటివ్ మహిళలు కుటుంబ విలువలను కాపాడటం కోసం ట్రంప్‌ను మద్దతు ఇచ్చారు.












Click it and Unblock the Notifications