Pakistan: పాకిస్థాన్ పూర్తిగా దివాలా తీసింది.. ఒప్పుకున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా
పాకిస్థాన్ పూర్తిగా దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ తెలిపారు.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ నేతలు స్పందించలేదు. కానీ తాజాగ పాకిస్థాన్ ఇప్పటికే దివాళా తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు."పాకిస్థాన్ దివాలా తీసింది.
స్థాపన, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహిస్తారు. మా సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉంది. IMF వద్ద పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం లేదు." సియాల్‌కోట్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో డు ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.

32 ఏళ్ల పాటు
ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి స్థాపన, బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులే కారణమని ఆసిఫ్ ఆరోపిస్తూ, తన 33 ఏళ్ల పార్లమెంట్‌లో 32 ఏళ్ల పాటు దేశ రాజకీయాలు అవమానకరంగా మారడాన్ని చూశానని అన్నారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారీ పొదుపు చర్యలను ప్రకటిస్తారని కూడా ఆసిఫ్ చెప్పారు.
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం మరో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వార్షిక ద్రవ్యోల్బణం ఈ వారంలో దాదాపు 40 శాతం కొత్త గరిష్టాన్ని తాకింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా నగదు కొరత ఉన్న పాకిస్థాన్‌లో ఈ వారం ద్రవ్యోల్బణం 38.42 శాతానికి పెరిగింది.

170 బిలియన్లు
గత కొన్ని వారాలుగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ పెద్దగా విజయం సాధించలేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిమాండ్‌ను నెరవేర్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పన్నులు విధించడం, పెట్రోలియం ధరలను పెంచడంతో పాటు అనేక చర్యలు తీసుకుంది. మినీ-బడ్జెట్ బిల్లు ద్వారా రూ. 170 బిలియన్లను సేకరించేందుకు కొత్త పన్నులు విధించడం ద్వారా పాకిస్తాన్ అధికారులు ప్రజలను షాకిచ్చారు.

ఐఎంఎఫ్ బృందం
ఆర్థిక సాయం చేసేందుకు చర్చలు జరిపేందుకు వచ్చిన ఐఎంఎఫ్ బృందం గత వారం తుది అంగీకారం కుదరకుండా వదిలేయడంతో పాకిస్థాన్ భయాందోళనకు గురవుతోంది. ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్ని ఐఎంఎఫ్ షరతులకు అంగీకరించినప్పటికీ ఇంకా ఒప్పంద కుదరనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications