ట్రంప్‌కు షాక్: డెమొక్రటిక్ పార్టీకే పట్టం కట్టిన అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి ప్రజలు జై కొట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయఢంకా మోగించింది. దీంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితమయ్యారు. మరోవైపు సెనెట్‌లో రిపబ్లికన్ల హవా కొనసాగింది. ఎన్నికలు 35 స్థానాలకు జరుగగా 26 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది.
ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బగా మిగిల్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్స్ పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయినట్లుగా తెలుస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఫలితాలతో ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్ పడే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమొక్రాట్ల ఆమోదం లేకుండా ట్రంప్ ముందుకెళ్లే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ప్రతి రెండేళ్లకోసారి, సెనేట్‌కు ప్రతి ఆరేళ్లకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల సమయానికి అధ్యక్ష పీఠంలో కూర్చు వ్యక్తి పాలనకు రిఫరెండంగా భావిస్తారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ..100 స్థానాలున్న సెనేట్‌కు 35 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications