ఇదేం విడ్డూరం.. పర్యావరణ సదస్సు కోసం పర్యావరణాన్నే నాశనం
తెలుగులో ఇటీవల రిలీజ్ అయిన సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో తండ్రి పాత్రలో ఉన్న వ్యక్తి కార్ డ్రైవింగ్ చేస్తూ .. వెనుక సీట్లో ఉన్న కొడుకు వైపు తిరిగి జీవితంలో ముందు చూపు ఉండాలి రా అని చెబుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో ప్రమాదంలో తండ్రి మృతి చెందుతాడు. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా సరిగ్గా అలాంటిదే. పర్యావరణాన్ని కాపాడడం కోసం ఓ సదస్సు నిర్వహించడం కోసం.. నిర్దేశించిన ప్రాంతంలో చెట్లు నరికేసి మరీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. దీంతో సర్వత్రా విమర్శల పాలవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఉద్దేశించి బ్రెజిల్ ప్రభుత్వం సదస్సు నిర్వహిస్తోంది. విరివిగా మొక్కలు నాటాలని ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సదస్సు నిర్వహణ కోసం పచ్చటి చెట్లను నరికేస్తున్నారు. దీంతో అడవులను నాశనం చేస్తూ ఏం చెప్పాలని అనుకుంటున్నారని బ్రెజిల్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవ వైవిధ్యంలో అమెజాన్ అడవులు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి అమెజాన్ అడవులను ధ్వంసం చేయడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ ఏడాదిలో నవంబర్ 30న బ్రెజిల్ లో క్లైమేట్ సమిట్ జరగనుంది. భూమి మీద నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ సదస్సు ఉద్దేశం అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమావేశం కోసం బ్రెజిల్ ఏర్పాట్లు మొదలుపెట్టింది.
ప్రతినిధుల బస, రాకపోకలు, సమిట్ వేదిక కోసం అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతినిధుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా ఓ రోడ్డును నిర్మించాలని ఉద్దేశించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. రోడ్డు నిర్మాణం కోసం వందలాది పచ్చని చెట్లను నరికేశారు. దీంతో ఈ రకంగా చేయడం ఏంటని స్థానికులు, వాతావరణ ప్రేమికులు ఫైర్ అవుతున్నారు.
BEYOND PARODY: Thousands of acres of protected Amazon rainforest are being cut down to build a highway for a Climate Summit in Brazil pic.twitter.com/DzFdmO2T7G
— TheBlaze (@theblaze) March 12, 2025












Click it and Unblock the Notifications