రష్యాలో ఉగ్రదాడి : 143కు చేరుకున్న మృతుల సంఖ్య

రష్యాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 143కు చేరింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులతో సహా 11 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యా పోలీసులు శనివారం తెలిపారు. దాడి చేసిన వారికి ఉక్రెయిన్‌లో పరిచయాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులు ఉక్రెయిన్ సరిహద్దువైపు వెళ్తున్నారని రష్యా భద్రతా ఏజెన్సీ తెలిపింది.ఇది 20 ఏళ్లుల్లో తమపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా రష్యా అభివర్ణించింది.

"ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత, నేరస్థులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దును దాటాలని ప్రయత్నించారని FSB తెలిపింది. ఈ దాడితో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ క్లైవ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశం ప్రకటించింది. దీని వెనక మాస్కో ప్రత్యేక దళాలు ఉన్నాయానే అనుమానం వ్యక్తం అవుతోంది.

Devastation in Russia 143 Dead in Terrorist Assault Perpetrators Apprehended

అంతర్జాతీయ కళాకారులకు ఆతిథ్యం ఇచ్చిన సమయంలోనే వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మిలిటరీ యూనిఫారాలు ధరించిన ఉగ్రవాదులు భవనంలోకి ప్రవేశించి, కాల్పులు జరిపారు. తాజాగా ఈ దాడి వెనుక తామే ఉన్నామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మాస్కో శివార్లలో దాడి చేసిన తమవారు "సురక్షితంగా వారి స్థావరాలకు చేరుకున్నారని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తెలిపింది.

మాస్కోలో సంగీత కచేరీ లక్ష్యంగా "ఉగ్రవాదులు" దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా రాయబార కార్యాలయం రెండు వారాల ముందే రష్యాను హెచ్చరించింది. అయిన తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ...గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Devastation in Russia 143 Dead in Terrorist Assault Perpetrators Apprehended

యూనియన్, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు ఇటలీ ,అమెరికా అనేక దేశాలు రష్యాపై జరిగిన దాడిని ఖండించాయి. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. "మాస్కోలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మోదీ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ తెలిపారు. రష్యా ప్రజలకు ఇండియా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వారికి భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+