వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవయాని ఇష్యూ: ఈరోజే డెడ్‌లైన్, ఏదో ఒకటని సల్మాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా దౌత్యకారిణి దేవయాని అరెస్టు నేపథ్యంలో భారత్‌లోని అమెరికా డిప్లోమేట్స్ తమ గుర్తింపు కార్డులను ఇవ్వాలని భారత్ ఆదేశించిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన డెడ్ లైన్ ఈరోజు(సోమవారం)తో ముగుస్తోంది. దేవయాని పైన వీసా ఫ్రాడ్ కేసును ఉపసంహరించుకోవాలని ఇండియన్ - అమెరికన్ గ్రూప్ డిమాండ్ చేసింది. దేవయాని పట్ల అమెరికా వైఖరి తమ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ - అమెరికన్ గ్రూప్ కేసు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆన్‌లైన్ వైట్ హౌస్‌కు పిటిషన్ దాఖలు చేసింది.

వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు

వీసా ఫ్రాడ్ కేసు ఎదుర్కొంటున్న దేవయానికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు లభించింది. ఐరాసలో భారత దౌత్యబృందం సభ్యురాలిగా గుర్తింపు లభించడంతో ఆమె ఎదుర్కొంటున్న కేసులో వ్యక్తిగత మినహాయింపు లభించింది.

కాగా, దేవయాని వ్యవహారంపై తలెత్తిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆదివారం చెప్పారు. మరోవైపు అమెరికా సైతం సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పింది. అమెరికాను విలువైన భాగస్వామిగా అభివర్ణించిన ఖుర్షీద్, భాగస్వామ్యం విలువను అమెరికా సైతం అర్థం చేసుకోవాలని కోరారు.

Devyani Khobragade

అమెరికాతో మనకు అద్భుతమైన సంబంధాలున్నాయని, మన విషయంలో అమెరికాకు సైతం ఇదే రకమైన భావన ఉందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. వివిధ స్థాయిలలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు పరిష్కారం సాధించేదాకా కొనసాగనివ్వండన్నారు. ఏదో ఒకటి జరుగుతుందన్నారు.

దేవయాని అరెస్టు, ఆమెను దుస్తులు విప్పి సోదా చేయడం కారణంగా తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి భారత విదేశాంగ శాఖ అధికారులతో ప్రైవేటు చర్చలు కొనసాగిస్తున్నట్టు వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా స్పష్టం చేశారు.

దేవయాని ఉదంతంపై తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పిన అమెరికా, దేవయానిని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి బదిలీ చేసినంత మాత్రాన ఆమెకు దౌత్య రక్షణ ఇంతకు ముందున్న పదవీ కాలానికి వర్తించదని స్పష్టం చేయడం గమనార్హం. దేవయాని కొత్త పదవిలో చేరినప్పటినుంచి ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేస్తూ, అయితే ఇంతకుముందు ఆమెపై పెట్టిన కేసులు మాత్రం అలాగే కొనసాగుతాయని చెప్పారు.

మరోవైపు, దేవయాని పనిమనిషి సంగీత రిచర్డ్స్‌కు న్యాయం చేయాలని అమెరికాలోని పలు హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హక్కుల సంఘాలు వీధుల్లోకొచ్చి నిరసన ప్రదర్శలను చేస్తున్నాయి. దౌత్యాధికారిణి ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్స్‌కు అమెరికా ప్రభుత్వం తగురీతిలో న్యాయం చేయాలని న్యూయార్క్‌లోని భారత కాన్సులెట్ భవనం ఎదుట ప్రదర్శనలు చేశారు.

దేవయాని స్థానంలో జయశంకర్

అమెరికాలో భారత రాయబారిగా జయశంకర్ మంగళవారం వాషింగ్టన్ చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. వీసా అవకతవకలకు సంబంధించి దేవయాని ఆరోపణలు ఎదుర్కోవడం, అరెస్టు కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయశంకర్ కొత్త దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఇప్పటి వరకు చైనాలో భారత రాయబారిగా ఉన్నారు.

English summary
An online White House petition demanding the Obama Administration drop the visa fraud case against Devyani Khobragade has been launched here by a group of Indian-Americans who said the senior Indian diplomat's public humiliation hurts the sentiments of the community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X