వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాతో బంధం: 41 ఏళ్ల వివాదానికి ముగింపు, ఆలయంలో మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢాకా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఢాకేశ్వరి ఆలయం, రామకృష్ణ మిషన్ తదితరాలను సందర్శించారు.

భారత్ - బంగ్లా మైత్రిలో ఇదో సువర్ణ శకం. హద్దులు చెరిపేసిన సరికొత్త ద్వైపాక్షిక అనుబంధం. భారత ప్రధాని మోడీ పర్యటన ఇందుకు శుభారంభం.

ఇరు దేశాల మధ్య బస్సు సర్వీసులు మొదలయ్యాయి. నాలుగు దశాబ్దాల సరిహద్దు వివాదం శాశ్వతంగా చరిత్రలో కలిసిపోయింది.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

మోడీతో కలిసి బంగ్లా ప్రధాని హసీనా బస్సు ప్రయాణమూ చేశారు. విభేదాల్లేవ్, ఇక స్నేహమేనంటూ మమతా బెనర్జీ ముందుకు రావడం భారత రాష్ట్రాలతో బంగ్లా అనుబంధానికీ బలం చేకూరింది.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక అడుగు పడింది. నాలుగు దశాబ్దాలకుపైగా వివాదాస్పదంగా ఉన్న 1974 నాటి భూసరిహద్దు ఒప్పందం (ఎల్‌బీసీ) పైన ఇరు దేశాలు శనివారం సంతకం చేశాయి.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

రెండు దేశాల ప్రధానులతో పాటు మమతా ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్నారు. తాజా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల నడుమ 162 భూభాగాలను మార్పిడి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

దీంతోపాటు బంగ్లాకు 200 కోట్ల డాలర్ల రుణసదుపాయం చేసేందుకు భారత్ అంగీకరించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి షేక్ హసీనా.. మోడీకి స్వాగతం పలికారు.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

కోల్ కతా నుండి ఢాకా మీదుగా అగర్తాలా వెళ్లే బస్సు సర్వీసును, ఢాకా - షిల్లాంగ్ - గుహవటి బస్సు సర్వీసును ఇరు ప్రధానులు, బెంగాల్ సీఎం కలిసి ప్రారంభించారు.

బంగ్లా పర్యటన

బంగ్లా పర్యటన

కోల్ కతా - ఢాకా - అగర్తాల బస్సు సర్వీసులతో పశ్చిమ బెంగాల్, త్రిపుర నడుమ 560 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. భారత్ తమకు ముఖ్య పొరుగు దేశమని హసీనా చెప్పారు.

English summary
PM Narendra Modi visits Dhakeshwari temple, Ramakrishna Mission, Indian chancery in Dhaka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X