వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఆసియా: ఒక బ్లాక్ బాక్స్ లభ్యం, సెర్స్ కొనసాగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: రెండు వారాల క్రితం జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం రెండు బ్లాక్ బాక్స్‌ల్లో ఒకటి లభించింది. డైవర్స్ సోమవారం ఒక్క బ్లాక్ బాక్స్‌ను కనిపెట్టగలిగారు. మృతదేహాల కోసం, శకలాల కోసం, బ్లాక్ బాక్స్‌ల కోసం సాగుతున్న అన్వేషణలో ఇది మలుపు. డాటా రికార్డర్ విమానం రెక్కల కింద లభ్యమైంది. దాన్ని సోమవారం ఉదయమే పైకి తీసుకుని వచ్చారు.

ఆ ప్రాంతం నుంచి మూడు ఇండోనిషియా నౌకలు పింగ్స్‌ను ఆ ప్రాంతం నుంచి తీసుకున్నాయి. అయితే, బలమైన అలలు, చూపు ఆనకపోవడం వల్ల కారణంగా వాటిని చూడలేకపోతున్నట్లు తెలుస్తోంది. శకలాల కింద 30 మీటర్ల లోతులో బ్లాక్ బాక్స్ ఉన్నట్లు కనిపెట్టారు. అంతకు మించి వివరాలు ఆందడం లేదు. మరో బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కోసం గాలింపు జరుగుతూనే ఉన్నది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అవి అత్యంత కీలకమైనవి.

Divers retrieve 1 black box from crashed AirAsia jet

డిసెంబర్ 28వ తేదీన ఎయిర్ ఆసియా విమానం కూలిపోయి 162 మంది మరణించిన విషయం తెలిసిందే. విమాన డాటా రికార్డర్‌ను విశ్లేషణ కోసం ఇండోనేషియా రాజధాని జకార్తాకు తీసుకుని వెళ్లనున్నారు. రికార్డు అయిన డాటాను డౌన్‌లోడ్ చేయడానికి రెండు వారాలు పట్టవచ్చునని భావిస్తున్నారు. విమానం తోకను శనివారంనాడు సేకరించిన విషయం తెలిసిందే. విమానం సముద్రంలో కూలిపోయినట్లు అవి ఊడిపోయి ఉంటాయని భావిస్తున్నారు.

అప్పటి బ్లాక్ బాక్స్‌లు లోపలే ఉండి ఉంటాయని అనుకున్నారు. కానీ అవి కూడా విడిపోయి ఉంటాయని ఇప్పుడు భావిస్తున్నారు. వర్షం కాలం కారణంగా భారీ అలలు సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. నదులు ప్రవహిస్తుండడంతో ఇసుక మేటలు డైవర్స్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

ఇప్పటి వరకు 48 మృతదేహాలను వెలికి తీశారు. మిగతా మృతదేహాలు విమానం మెయిన్ క్యాబిన్‌లో ఉంటాయని భావిస్తున్నారు. మెయిన్ క్యాబిన్ జాడ ఇంకా తెలియాల్సి ఉంది. ఆదివారంనాడు మరో మూడు మృతదేహాలను గుర్తించారు. దక్షిణ కొరియాకు చెదిన పార్క్ సియోుంగ్‌బియోమ్ (37), ఆయన భార్య లీ క్యూయింగ్ హవా (34) ఆ ముగ్గురిలో ఉన్నారు.

English summary
Divers retrieved one of the two black boxes on Monday from the AirAsia plane that plummeted more than two weeks ago into the Java Sea, a major breakthrough in the slow-moving hunt to recover bodies and wreckage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X