టోక్యో ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన బొకేల కథేంటో తెలుసా

ఒలింపిక్స్‌లాంటి విశ్వ క్రీడల్లో గెలుపొందడం ఏ ఆటగాడికైనా ఓ మరుపురాని అనుభూతి.
అలాంటి మధురమైన క్షణాల్లో విజేతలకు పతకాలతో పాటు బొకేలు అందిస్తుంటారు.
టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలకు అందించిన బొకేలకు ఒక ప్రాముఖ్యత ఉంది.
భారీ విపత్తు సంభవించిన ప్రాంతాల్లో వికసించిన పూలతో ఈ బొకేలను తయారు చేశారు.
ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల్లో 5,000 కంటే ఎక్కువ బొకేలు అథ్లెట్లకు అందజేశారు.
2011లో భూకంపం, సునామీ ఆ తర్వాత ఫుకుషిమా అణు కేంద్రంలోని మూడు రియాక్టర్లు కరిగిపోవడంతో జపాన్ తీవ్రంగా నష్టపోయింది.
ఇవాటే, ఫుకుషిమా, మియాగి ప్రాంతాలలో సంభవించిన విపత్తులో దాదాపు 20వేల మంది మరణించారు.
బొకేల్లో ఉపయోగించిన పూలను ప్రధానంగా ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ రెండింటిలోనూ పతక విజేతలకు ఇచ్చిన బొకేల్లో వాడిన పసుపు, ఆకుపచ్చ, నీలం రంగు పూలను ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు.
- టోక్యో ఒలింపిక్స్: ఏ దేశానికి ఎన్ని పతకాలు? ఇదీ జాబితా
- నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్ బంగారు పతకంతో సరికొత్త రికార్డు

బొకేల్లో వాడిన ప్రకాశవంతమైన పసుపురంగులోని పొద్దుతిరుగుడు మొక్కలను మియాగిలో పెంచారు.
విపత్తులో మరణించిన వారి తల్లిదండ్రులతో ఈ మొక్కలను నాటించారు.
సునామీ బారి నుంచి పిల్లలను కాపాడిన కొండను ఈ మొక్కలు నాటడానికి ఎంచుకున్నారు.తెలుపు, ఊదా రంగులోని పుష్పాలనిచ్చే యూస్టోమాలు, సోలమన్ సీల్స్‌లు ఫుకుషిమాలో పెరిగాయి.
నాటి విపత్తు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించింది.
జెంటియన్స్ ఒక చిన్న ప్రకాశవంతమైన నీలం పువ్వు. 2011 విపత్తులో ధ్వంసమైన తీర ప్రాంతం ఇవాటేలో ఈ పూలను సాగు చేశారు. ఇక పూల బొకేకు తొడుగుగా వాడే ఆకుపచ్చ ఆస్పిడిస్ట్రాలను మాత్రం ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టోక్యో నగరానికి సూచికగా ఇక్కడ పెంచారు.
ఇవి కూడా చదవండి:
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- టోక్యో ఒలింపిక్స్: పతకం చేజారినా, హృదయాలను గెల్చుకున్న భారత మహిళా హాకీ జట్టు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- టోక్యో ఒలింపిక్స్: కుస్తీలో కాంస్య పతకం గెలిచిన బజ్రంగ్ పూనియా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications