Donald Trump Vs Kamala Harris: కమలతో పోరులో ఎట్టకేలకు తగ్గిన ట్రంప్-సెప్టెంబర్ 4న..

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా మారిన రిపబ్లిక్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధుల్ని అస్సలు పట్టించుకునే పరిస్దితుల్లో లేరు. గతంలో అధ్యక్షుడు, ఈసారి డెమోక్రాట్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని భావించిన జో బైడెన్ తో చర్చలో పైచేయి సాధించిన ట్రంప్.. ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో దాదాపు ఈ ఎన్నికల్లో నెగ్గేసినట్లే భావించారు. అయితే కమలా హ్యారిస్ ఎంట్రీతో పరిస్దితి మారింది. ట్రంప్ కన్నా కమలకే పలు చోట్ల మద్దతు లభిస్తోందన్న సర్వే అంచనాల నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేశారు.

కమలా హ్యారిస్ పై జాత్యంహంకార వ్యాఖ్యలు చేస్తూ ఆమెను డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవకుండా చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కమలా హ్యారిస్ కూడా ట్రంప్ కామెంట్స్ కు అంతే దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ట్రంప్ ఇగో దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్దితుల్లో తనకు ప్రత్యర్ధిగా, పోటీగానే భావించని కమలా హ్యారిస్ పై ఓ విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గారు.

Donald Trump Agreed to debate With Kamala Harris on Fox News On Sept 4

ఇన్నాళ్లూ కమలా హ్యారిస్ తనకు పోటీయే కాదని చెప్తూ వచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఆమెతో టీవీ చర్చకు అంగీకరించారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ కు తన అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 4న కమలా హ్యారిస్ తో చర్చకు ట్రంప్ అంగీకరించినట్లు ఫాక్స్ న్యూస్ ప్రకటించింది.

ఈ చర్చలో కమలా హ్యారిస్ పై పైచేయి సాధించగలనని ట్రంప్ ధీమాగా ఉన్నారు. అసలే కాకమీదున్న ట్రంప్.. కమల నుంచి ఈ చర్చలో ఏవైనా ప్రతికూల ప్రశ్నలు ఎదురైతే ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. దీంతో సెప్టెంబర్ 4 చర్చతో వీరిద్దరిలో అధ్యక్ష స్ధానానికి ఎవరు కరెక్ట్ అన్నది కూడా తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+