వివాదాస్పదం: ట్రంప్ అడ్వయిజర్ కాన్ వే నెటిజన్ల విమర్శలు, మర్యాద లేదంటూ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన పాలకవర్గం కూడ వివాదాలకు దూరంగా ఉండేవారు కాదని తేటతెల్లమైంది.
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ఆయన సహయకులు , పాలక వర్గం కూడ వివాదాలకు తావిచ్చే వారేనని తేటతెల్లమైంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోకు ఫోజిస్తుండగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే సలహదారురాలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
శ్వేత సౌధాన్ని అక్కడ పనిచేసేవారు అత్యంత పవిత్రంగా చూస్తారు. అలాంటిది సాక్షాత్తూ ట్రంప్ ఆయన సహచరులంతా వైట్ హౌజ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోటోకు ఫోజిస్తుండగా ట్రంప్ సలహదారురాలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ సలహదారురాలు కెల్ యానే కాన్ వే వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది.

వైట్ హౌజ్ లోని సోఫాపై తన బూట్లు కూడ విప్పకుండానే మోకాళ్ళపై కూర్చొని సరదాగా నవ్వుతూ కన్పించారు. అయితే ఈ విషయాన్ని ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు ఆమె తీరును తప్పుబడుతున్నారు.
వైట్ హౌజ్ అంటే కనీసం మర్యాద కూడ లేకుండా తన షూ కూడ తొలగించకుండా అతిథులు సేద దీరే సోఫాలో మోకరిల్లడంపై మండిపడుతున్నారు.
ఓవెల్ ఆఫీసులో కనీసం తన షూ కూడ విప్పకుండానే కాన్ వే అలా సోఫాలో మోకాళ్ళపై కూర్చోవడం ట్రంప్ టీమ్ పాటించే కనీస గౌరవ మర్యాదల విలువ ఏమిటో తెలుపుతోందని ట్విట్టర్ లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.ట్విట్టర్ లో యూజర్లు ఈ మేరకు ఈ కాన్ వే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications