Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రివర్స్ మైగ్రేషన్ ప్రకటించిన ట్రంప్- భారీ షాక్: ఇక వారికి అమెరికాలో నో ఎంట్రీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. 'మూడవ ప్రపంచ దేశాల' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా పౌరులందరికీ థాంక్స్‌ గివింగ్ శుభాకాంక్షలు అంటూ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది అత్యవసరమని అన్నారు. జో బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను రద్దు చేస్తానని తెలిపారు. దీనికంతటికి గత ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రభుత్వాన్ని స్లీపీ ఆటో పెన్..గా అభివర్ణించారు. అమెరికాను ప్రేమించలేని ఎవరినైనా తొలగిస్తానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

Donald Trump announces No More Migration from 3rd World Countries

గ్రీన్ కార్డ్ ఉన్న ఒక వలసదారు 30,000 డాలర్లు సంపాదిస్తుంటే, అతని కుటుంబానికి సంవత్సరానికి సుమారు 50,000 డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు లభిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. వాస్తవ వలసదారుల సంఖ్య దీని కంటే చాలా ఎక్కువగా పేర్కొన్నారు. ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణమని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. అధిక నేరాలు, పట్టణ జనాభాలో క్షీణత, దిగజారిన పాఠశాలలు, ఆసుపత్రు్లో రద్దీ, గృహాల కొరత, భారీ లోటు బడ్జెట్ వంటివి దీనికి నిదర్శనమని చెప్పారు.

ఒకప్పుడు గొప్ప రాష్ట్రంగా వెలుగొందిన మిన్నెసోటాను సోమాలియా నుండి వచ్చిన లక్షలాది శరణార్థులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోమాలియన్ ముఠాలు వీధుల్లో తిరుగుతూ ఇక్కడి వారిని ఎరగా చూస్తోన్నారని, మిన్నెసొటా ప్రజలు ఇళ్లలో భయంతో జీవిస్తున్నారని అన్నారు.

నాన్ అమెరికన్ సిటిజన్స్ కు ఇప్పటవరకు అందుతున్న ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తానని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసి, ప్రజా భారంగా మారిన, భద్రతకు ప్రమాదకరంగా ఉన్న లేదా పాశ్చాత్య నాగరికతకు సరిపోని ఏ విదేశీయుడిని అయినా బహిష్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాంటి వారికి అమెరికాలో నివసించే అధికారం లేదని తేల్చి చెప్పారు.

ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఓషియానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న తక్కువ, మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా నిలుస్తారు. ఆయా దేశాల శరణార్థుల భారాన్ని అమెరికన్లు మోస్తోన్నారని, అది సామాజిక అసాధారణత్వానికి ప్రధాన కారణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా పురోగమిస్తున్నప్పటికీ, వలస విధానం ఆ లాభాలను, చాలా మంది జీవన పరిస్థితులను క్షీణింపజేసిందని పేర్కొన్నారు. రివర్స్ మైగ్రేషన్ మాత్రమే ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేయగలదని తేల్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+