హిందువులకు అభిమానిని, మోడీ చాలా గ్రేట్: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, తాను భారత దేశానికి, హిందూ మతానికి పెద్ద అభిమానిని అని చెప్పారు. ట్రంప్ అమెరికాలోని భారతీయ, హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే భారత్, అమెరికాల మధ్య మరింత మంచి సంబంధాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటు చేసిన ఇండియన్ - అమెరికన్స్ చారిటీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామగా అభివర్ణించారు. ఇరు దేశాలకూ అద్భుత భవిష్యత్ ఉందన్నారు. తన చేతులకు పరిపాలన బాధ్యతలు వస్తే, ఇరు దేశాలూ మరింత దగ్గరవుతాయన్నారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

భారత నేతలు చాలా ఉత్సాహంతో పని చేస్తున్నారన్నారు. తాను హిందువులకు, భారత దేశానికి పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. మోడీ పైన తనకెంతో నమ్మకం ఉందన్నారు. మోడీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. పందొమ్మిది నెలల క్రితం తాను భారత్ వెళ్లానని, ఇకపై కూడా ఎన్నోసార్లు వెళ్లాలని ఉందన్నారు.
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. ముంబై దాడులను ట్రంప్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు అయిదువేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. తాను గెలిస్తే హిందువులు, భారతీయులు శ్వేత సౌధానికి మంచి మిత్రులుగా మారటం ఖాయమని చెప్పారు. అమెరికాలోని హిందువులంతా తనకు మద్దతు పలికి టెర్రరిజానికి చరమగీతం పాడాలన్నారు.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..












Click it and Unblock the Notifications