వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజంగా అద్భుతం: బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడంపై ట్రంప్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రెగ్జిట్ ఫలితాలపై రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా అద్భుతమని ఆయన పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్‌లోని స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బ్రెగ్జిట్ ఫలితాలపై ఆయన మాట్లాడుతూ ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడం చాలా గొప్ప విషయమన్నారు. బ్రిటన్‌ వాసులు తమ దేశాన్ని తిరిగి సాధించుకున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.

టర్న్‌బెర్రీలోని తన గోల్ఫ్ కోర్స్‌ను తిరిగి ప్రారంభించేందుకు శుక్రవారం ఉదయం ట్రంప్‌ బ్రిటన్‌కు వచ్చారు. గతేడాది మే నెలలో ఓ టీవి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వలసలు యూరప్‌కు పెద్ద అడ్డంకిగా మారాయని ఈ సందర్భంగా అన్నారు. తద్వారా బ్రిటన్‌లో ఆర్ధిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడమే మంచిదని, ఇది రికమండేషన్ కాదని, నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

English summary
Presumptive Republican presidential nominee Donald Trump on Friday weighed in on Britain’s historic decision to leave the European Union during a business trip to Scotland to christen his newly refurbished Turnberry golf resort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X