ఉక్రెయిన్‌పై ట్రంప్ సంచలనం నిర్ణయం?
Donald Trump and Zelensky: మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించట్లేదనేది వైట్‌హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్‌స్కీ. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.

అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ- వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్‌స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు.
ఫలితంగా- ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున ట్రంప్ వాదిస్తోన్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. మధ్యవర్తిగా రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్నారనే వాదనను వినిపించారు.
ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్‌స్కీ.. వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. చర్చల మధ్యలో నుంచే వెళ్లిపోయినందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు.
దీని తరువాత జెలెన్‌స్కీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ దేశం నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లి బయలుదేరి వెళ్లిపోయారు. ఇమ్మానుయెల్ మక్రాన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవంక- మెజారిటీ యూరప్ దేశాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. జెలెన్‌స్కీ ఒంటరివాడు కాదని, ఆయనకు అండగా ఉంటామని ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు అందించిన అన్ని రకాల సహాయ, సహకారాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఆర్థికం, రక్షణ, ఆయుధ సామాగ్రి తరలింపును రద్దు చేయడం మొదలుకుని ద్వైపాక్షిక సంబంధాలపైనా పునఃసమీక్షించుకుంటారని సమాచారం.
దీనిపై ది వాషింగ్టన్ పోస్ట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తూ వచ్చింది అమెరికా. అత్యాధునిక యుద్ధ సామాగ్రినీ తరలించింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో దీనికి సంబంధించిన పలు ఒప్పందాలు ఈ రెండు దేశాల మధ్య కుదిరాయి కూడా.
ఫలితంగా- ఇన్నేళ్లుగా రష్యాను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చింది ఉక్రెయిన్. ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాల వ్యవహారం బెడిసి కొట్టిన నేపథ్యంలో ఆయా ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలనే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పొందుపరిచింది.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications