ట్రంప్ 'లాస్ట్ వార్నింగ్'!

Donald Trump: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. గాజాలో బందీల విడుదలకు సంబంధించి తన చివరి హెచ్చరికను జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. హమాస్ మొదటి రోజునే మిగిలిన 48 మంది బందీలను విడుదల చేయాలి. దానికి బదులుగా ఇజ్రాయెల్ వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. ఈ కాల్పుల విరమణ సమయంలో శాంతి చర్చలు జరుగుతాయి.

డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' లో హమాస్ ను ఉద్దేశించి ఓ కీలక పోస్ట్ చేశారు. అందులో "ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది" అని రాశారు. "ఈ షరతులను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హమాస్‌కు హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇకపై ఇలాంటివి ఉండవు" అని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump Issues Last Warning to Hamas Over Gaza Hostages Ceasefire Proposal Revealed

డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు ఈ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను శనివారం రోజున చేసినట్లు తెలిసింది. ఈ ఒప్పందం కింద హమాస్ మిగిలిన 48 మంది బదిలీలను కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. దానికి బదులుగా ఇజ్రాయెల్ లో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఈ సమయంలో గాజా స్ట్రిప్ లో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతాయి.

ట్రంప్ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను తాము గౌరవంగా పరిశీలిస్తున్నామని ఓ ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. ఆదివారం నాడు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ మాట్లాడుతూ.. హమాస్ బందీలను విడుదల చేసి.. ఆయుధాలు కింద పెడితే గాజాలో యుద్ధం ముగుస్తుందని చెప్పారు. హమాస్ బందీలందరినీ విడుదల చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించి, గాజా సిటీ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని పాత వైఖరిని పునరుద్ఘాటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+