మోడీకి ట్రంప్ తాజా ఆఫర్..! సై అంటే మీ వాళ్ల జోలికి రాం..?

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే తన దేశంలో అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పనిలో పనిగా తన దేశానికి పనికొచ్చేలా ఈ వ్యవహారాన్ని మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వలసదారుల గుర్తింపు, అరెస్టులు, స్వదేశాలకు తమ విమానాల్లోనే తరలింపులు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల ముందు పలు ఆఫర్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మరో ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు.

గతేడాది జూన్ లో వెలువడిన లెక్కల ప్రకారం భారత్ నుంచి అమెరికాలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 54 లక్షలుగా తేలింది. వీరిలో అక్రమ వలసదారులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య ఎంతో నిర్దిష్టంగా తేల్చేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మిగతా దేశాల వలసల తరహాలోనే మన దేశం నుంచి వెళ్లి అక్రమంగా అమెరికాలో పాగా వేసిన వారిని కూడా తరిమేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వీరిని నిర్ధారించేందుకు అమెరికా ప్రభుత్వం అనుసరించే ప్రామాణికాలను ఇప్పటివరకూ వెల్లడించలేదు.

Donald trump likely to link defence purchases with Indian immigrants deportation in modi s visit

అయితే భారత్ నుంచి అమెరికా వచ్చి అక్రమంగా వలసదారులుగా ఉన్న వారిని బహిష్కరించడం ఖాయమన్న సంకేతాలను మాత్రం ట్రంప్ సర్కార్ ఇచ్చేసింది. దీంతో ఇప్పటికే భారత్ గుర్తించిన తమ అక్రమ వలసల్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 18 వేల మందిని వెనక్కి తెస్తామని విదేశాంగమంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంకెందరిని వెనక్కి పిలిపించాలనే అంశంలో కసరత్తు జరుగుతోంది.

ఇలాంటి సమయంలో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫోన్ కాల్ చేశారు. ఇందులో మీ అక్రమ వలసలను వెనక్కి పిలిపిస్తారా లేక మమ్మల్నే తరిమేయమంటారా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై అమెరికా వచ్చి చర్చిస్తానని ట్రంప్ కు చెప్పారు. దీంతో వైట్ హౌస్ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది. భారత ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా వచ్చి ట్రంప్ తో భేటీ అవుతారని వెల్లడించింది. అలాగే మోడీకి ట్రంప్ పెట్టిన షరతుపై కూడా సంకేతాలు ఇచ్చేసింది.

అమెరికా రక్షణ సామాగ్రిని ఇప్పటికే భారీగా కొనుగోలు చేస్తున్న భారత్.. ఇప్పుడు ట్రంప్ షరతుతో దాన్ని మరింత పెంచాల్సిన పరిస్ధితి ఎదురు కాబోతోంది. ఈ మేరకు తమ రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో భారతీయ వలసల బహిష్కరణకు ట్రంప్ లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మోడీ-ట్రంప్ చర్చల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. వీరిద్దరి చర్చల తర్వాత అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లపై భారత్ నుంచి వచ్చే ప్రకటనను బట్టి వలసలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. మరి భారత్ తమ వలసల కోసం అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+