కళ్లు చెదిరే మెజారిటీ- 300 మార్క్ దాటిన ట్రంప్: అరిజోనా స్వీప్
Donald Trump: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటోన్నారు. 47వ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు.
ఒక్క అరిజోనా మినహా మిగిలిన అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. ఆమెకు పడ్డ ఎలక్టోరల్ ఓట్లు 226. అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ అవలీలగా అందుకోవడం వల్ల ఇప్పటికే ఆయన అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు.
ఇక తాజాగా అరిజోనా ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత మరింత పెరిగింది. 300 ఎలక్టోరల్ ఓట్ల మార్క్‌ను అధిగమించింది. అరిజోనాలో వచ్చిన ఆధిక్యత కారణంగా ఆయనకు పోల్ అయిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య.. 312. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌కు పడ్డ ఓట్లు 7,46,49,984.

అరిజోనాలో 2016లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్‌కు అత్యధిక ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.స్వింగ్ స్టేట్‌లల్లో ఒకటైన అరిజోనాలో కూడా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓట్ల సంఖ్య కొద్దిగా పెరిగిందే తప్ప ఆమెకు పడ్డ 226 ఎలక్టోరల్ ఓట్లల్లో ఒక్కటి కూడ పెరగకపోవడం డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యాన్ని అద్దం పట్టినట్టయింది.
అరిజోనాతో కలుపుకొని కమలా హ్యారిస్‌కు పోల్ అయిన ఓట్లు 7,09,16,507. ఏడు స్వింగ్ స్టేట్స్ జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సిన్‌తో పాటు అరిజోనాను కూడా క్లీన్ స్వీప్ చేసి పడేశారు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ లభించిన మెజారిటీనే ఆయనను అందలం ఎక్కించిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications