ఉ.కొరియాపై అమెరికా అనూహ్య స్పందన: ట్రంప్ నుంచి ఆ మాట ఊహించలేదు..
దాడి చేయమంటూ ఉత్తరకొరియా ప్రకటించడంతో.. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ నిర్ణయాన్ని ట్రంప్ ప్రశంసించారు.
వాషింగ్టన్: నిన్నటిదాకా కత్తులు దూసుకున్న శత్రువుల్లా కనిపించిన అమెరికా-ఉత్తరకొరియాలు.. యుద్దం ఆలోచన మానేసి ఒకరితో ఒకరు స్నేహంగా మెలగాలనే ఆలోచనలో ఉన్నట్లున్నాయి. అయితే తాత్కాళికమా.. లేక దీర్ఘకాలం ఇదే వైఖరి కొనసాగుతుందా? అన్నది చెప్పలేం.
ట్రంప్ హెచ్చరికలతో ఉరుము ఉరిమినట్లే ధీటైన వ్యాఖ్యలు చేసిన ఉత్తరకొరియా.. అమెరికా ఆధీనంలో గువాం ద్వీపాన్ని సర్వ నాశనం చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ధ్వంస రచన చేస్తున్నట్లు న్న కిమ్ ఫోటోలు బయటకు రావడం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
కానీ కిమ్ యుద్దం ఆలోచన విరమించుకున్నారని, ఇప్పట్లో గువాంపై దాడి చేయవద్దని ఆయన భావిస్తున్నట్లుగా ఉత్తరకొరియా మీడియా ప్రకటించడంతో పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అప్పటిదాకా అమెరికా-ఉత్తరకొరియా మధ్య కమ్ముకున్న యుద్ద మేఘాలు ఒకింత తొలగిపోయాయి.
Kim Jong Un of North Korea made a very wise and well reasoned decision. The alternative would have been both catastrophic and unacceptable!
— Donald J. Trump (@realDonaldTrump) August 16, 2017
తొలిసారి ఉత్తరకొరియా కాస్త సంయమనంగా వ్యవహరించడం అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా నచ్చినట్లుంది. అందుకే ఆ దేశంపై ఆయన పొగడ్తలు కురిపించారు. 'ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలివైన, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. యుద్దమే ప్రత్యామ్నాయం అనుకుంటే విధ్వంసకరమైన, అమోధయోగ్యం కాని వాతావరణం నెలకొనేది' అని వ్యాఖ్యానించారు.
తొలిసారి ఉత్తరకొరియా అధ్యక్షుడిని పొగుడుతూ ట్రంప్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నిన్నటిదాకా ఢీ అంటే ఢీ అనుకున్న శత్రువులు కాస్త.. పునరాలోచనలో పడి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ పరిణామం ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేసేదే.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications