భారతీయ విద్యార్ధులకు ట్రంప్ బిగ్ షాక్ ! ఏకంగా 27 శాతం కోత..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ విదేశీ వలసదారులు, విదేశీ విద్యార్దులు ఇలా విదేశాల నుంచి వచ్చే ప్రతీ వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో వారికి వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వీసాలపై ఆంక్షలు విధించి తొలగించడంతో పాటు కొత్తగా వారికి వీసాలు మంజూరు చేసే విషయంలోనూ నిబంధనల్ని కఠిన తరం చేసేశారు. తద్వారా తన అమెరికా ఫస్ట్ నినాదాన్ని నెగ్గించుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో భారతీయ విద్యార్ధులకు, వృత్తి నిపుణులకు ఇచ్చే ఎఫ్ 1 వీసాల విషయంలోనూ ట్రంప్ సర్కార్ భారీగా కోతలు విధిస్తోంది. దీంతో ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్ధులు, వృత్తి నిపుణులు తమ వీసాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఏ స్ధాయిలో ఉందో తాజాగా అమెరికా అధికారులు గణాంకాలు బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే గతేడాది ఇచ్చిన భారతీయ విద్యార్దులకు ఇచ్చిన ఎఫ్ 1 వీసాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 27 శాతం తక్కువ వీసాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇది కరోనా తర్వాత అత్యల్పంగా నమోదైంది.

Donald trump regime cutoff 27 percent F1 visas to Indian students compare from last year

వాస్తవానికి ఇది వీసాల జారీ విషయంలో కీలకమైన సీజన్. ఆగస్టు, సెప్టెంబర్ లో వివిధ కోర్సుల్లో చేరేందుకు భారతీయ విద్యార్ధులు ఎక్కువగా అమెరికా వెళ్తుంటారు. వీరంతా వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈ సీజన్ లోనే విద్యార్ధులకు ఇలా భారీ సంఖ్యలో వీసాలు నిరాకరించడం ద్వారా ట్రంప్ తన కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఈ ఏడాది మార్చి నుండి మే వరకు భారతీయ విద్యార్థులకు మొత్తం 9,906 ఎఫ్ 1 వీసాలు జారీ చేశారు. 2022లో అంటే కరోనా తగ్గుముఖం పట్టాక ఇదే కాలంలో 10,894 వీసాలు జారీ అయ్యాయి. 2023లో చూసినా ఈ నెలల్లో మొత్తం 14,987 ఎఫ్1 వీసాలు జారీ చేశారు. గతేడాది కూడా ఇదే సమయంలో 13,478 వీసాలు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే వీసా కోతలు అర్దమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+