అమెరికాలో తొలిసారి: నేరారోపణలను ఎదుర్కొన్న వివిధ దేశాధ్యక్షులు, ప్రధానులు వీరే

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసుల్లో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే. అమెరికా చరిత్రలో ఇదొక అసాధారణ ఘట్టం. 2024లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయడానికి సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.

డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, ప్రధానమంత్రులు- మనీ లాండరింగ్ సహా వివిధ నేరారోపణలను ఎదుర్కొన్నారు. వారిలో కొందరు జైలుపాలయ్యారు కూడా. ఇప్పుడు ట్రంప్ కూడ అదే జాబితాలో చేరారు. ఈ జాబితా పెద్దదే. పాకిస్తాన్ కూడా ఇందులో ఉంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై 85 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఉగ్రవాదం, అవినీతి, దేశద్రోహం, కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయి.

world leaders in criminal charges

2022లో అర్జెంటీనా మాజీ ఉపాధ్యక్షురాలు క్రిస్టీనా ఫెర్నాండెజ్ డీ కిష్నెర్.. వివిధ నేరారోపణలను ఎదుర్కొన్నారు. 2007 నుంచి 2015 మధ్యకాలంలో అధ్యక్షురాలిగా పని చేసిన సమయంలో అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అవి రుజువు కావడంతో ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది. రాజకీయాల్లోకి ప్రవేశించకుండా జీవితకాల నిషేధానికి గురయ్యారు. బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వాపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. 2021 వాటిని న్యాయస్థానం కొట్టివేసింది.

తన హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై క్రొయేషియా మాజీ ప్రధానమంత్రి ఇవో సనాడెర్‌కు 2020లో ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు జాక్వెస్ చిరాక్, నికొలాస్ సర్కోజీ కూడా నేరారోపణలను ఎదుర్కొన్నారు. జాక్వెస్ చిరాక్ 2019లో కన్నుమూశారు. అవినీతి కేసుల్లో 2021లో నికొలాస్ సర్కోజీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగాలపై జర్మనీ మాజీ అధ్యక్షుడు క్రిస్టియన్ ఉల్ఫ్‌ విచారణను ఎదుర్కొన్నారు.

అత్యాచారం, తన కిందిస్థాయి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల కేసులో ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు మోషె కట్సావ్‌పై ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయిదు సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించిన తరువాత విడుదలయ్యారు. ఇజ్రాయెల్‌కే చెందిన యహుద్ ఒల్మెర్ట్‌తో పాటు బెంజమిన్ నెతన్యాహు కూడా నేరారోపణలను ఎదుర్కొన్నారు.

ప్రాస్టిట్యూషన్ కేసులో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీని ఆ దేశ న్యాయస్థానం దోషిగా తేల్చింది. దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షులు జాకబ్ జుమా, లీ మ్యుంగ్ బాక్, పాకిస్తాన్, పోర్చుగల్, మలేసియా మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, జోస్ సోక్రటీస్, ముహ్యుద్దిన్ యాస్సీన్, నజీబ్ రజాక్.. నేరారోపణలను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+