ట్రంప్ కొత్త ప్రేమకథ: చైనాతో స్నేహం, మద్దతుదారులకు షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఆయన సొంత మద్దతుదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి.ఓ వైపు భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూనే.. మరో వైపు చైనా పట్ల మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యగా 6 లక్షల మంది చైనా విద్యార్థులకు అమెరికన్ వీసాలు మంజూరు చేస్తామని ట్రంప్ చేసిన ప్రకటన ఆయన అనుచరులనే ఆశ్చర్యానికి గురి చేసింది.

సోమవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, అమెరికా-చైనాల మధ్య చాలా ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 6 లక్షల మంది చైనా విద్యార్థులకు అమెరికా స్వాగతం పలుకుతుందని వెల్లడించారు. ఈ ప్రకటన గతంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన కఠినమైన విధానాలకు పూర్తి విరుద్దంగా ఉంది. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా పరిశోధన రంగాలకు చెందిన వారికి వీసాలు రద్దు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఆయన గత వాగ్దానానికి యూటర్న్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Donald Trump s New Love Story China Gets Visa India Gets Tariff Supporters Stunned

ట్రంప్ నిర్ణయం వెనుక కారణాలు
ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చైనాతో జరుగుతునన వాణిజ్య చర్చలు ముఖ్య కారణం కావచ్చు. ప్రపంచంలో అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు సుంకాలు, అమెరికా పరిశ్రమలకు కీలకమైన 'రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్' సరఫరా, అలాగే చైనాకు అధునాతన ఏఐ చిప్‌ల లభ్యత వంటి అంశాలపై ఒక కీలక వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్చల మధ్య చైనా విద్యార్థులకు వీసాలు ఇవ్వడం ద్వారా చైనాను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ మద్దతుదారులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. ఈ నిర్ణయం తమ 'అమెరికా ఫస్ట్' అజెండాకు ద్రోహం చేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ పట్ల అత్యంత విధేయత ఉన్న కన్జర్వేటివ్ వ్యాఖ్యాత లారా లూమర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా విద్యార్థులను "సీసీపీ గూఢచారులు"గా ఆమె అభివర్ణించారు. ట్రంప్ వలస విధానాలను బలహీనపరిచేలా ఈ నిర్ణయం ఉందని ఆమె ఆరోపించారు. ఎక్స్ వేదికగా లారా లూమర్ పోస్ట్ చేస్తూ.. "మరింత మంది ముస్లింలను, చైనా ప్రజలను అమెరికాలోకి తీసుకురావడానికి నేను ట్రంప్‌కు ఓటు వేయలేదు. దయచేసి అమెరికాను చైనాగా మార్చకండి. MAGA (Make America Great Again) మరింత మంది వలసదారులను కోరుకోవడం లేదు" అని రాశారు. మరో పోస్ట్‌లో, "ఎవరూ.. నేను మళ్లీ చెబుతున్నాను, ఎవరూ.. మరో 6 లక్షల మంది చైనా 'విద్యార్థులను' అంటే కమ్యూనిస్ట్ గూఢచారులను అమెరికాలో కోరుకోవడం లేదు. చైనా 12 లక్షల మంది అమెరికన్లను చంపింది. ఇప్పుడు వాళ్లు మన స్థానాన్ని భర్తీ చేస్తారా? ఇది జరగదు" అని లూమర్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఈ పరిణామాలు ట్రంప్ పాలనపై స్వపక్షంలోనే పెరుగుతున్న అసంతృప్తిని సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+