ట్రంప్ కుటుంబంలో విషాదం - డొనాల్డ్ తమ్ముడు రాబర్డ్ మృతి - ప్రెసిడెంట్ భావోద్వేగం..

అమెరికాలోని ప్రఖ్యాత వ్యాపార కుటుంబం 'ట్రంప్ ఫ్యామిలీ'లో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతిచెందారు. 71 ఏళ్ల రాబర్ట్.. కొంతకాలంగా మన్‌హట్టన్‌లోని న్యూయార్క్-ప్రెస్‌బైటేరియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూసినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

మెదడులో నెత్తురు గడ్డకట్టడంతో రాబర్ట్ ట్రంప్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇటీవల స్పృహతప్పి పడిపోవడంతో ఆయనకు రక్తస్రావం అయిందని, చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని, శనివారం నాటికి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారని అమెరికన్ మీడియా పేర్కొంది.

Donald Trumps younger brother Robert dies at 71, Was My Best Friend, says us president

తమ్ముడు రాబర్ట్ మృతి పట్ల ప్రెసిడెంట్ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు. ''తను నాకు కేవలం తమ్ముడు మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. రాబర్ట్ మమ్మల్ని విడిచిపోయాడు.. అయితే, మేమంతా మళ్లీ కలుసుకుంటాం.. ''అని ట్రంప్ పేర్కొన్నారు. ఐదుగురు సంతానంలో రాబర్ట్ చిన్నవాడుకాగా, డొనాల్డ్ పెద్దన్న ఫ్రెడ్ జూనియర్ తీవ్ర అనారోగ్యంతో 1981 లో మరణించాడు.

Donald Trumps younger brother Robert dies at 71, Was My Best Friend, says us president

2016నాటి అధ్యక్ష న్నికల్లో డొనాల్డ్ తరఫున రాబర్ట్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉడిపోయిన రాబర్ట్.. ఈ ఏడాది డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన మేనకోడలు మ్యారీ ట్రంప్ రాసిన 'ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి' పుస్తకానికి వ్యతిరేకంగా న్యాయపోరాటంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. రాబర్ట్ మరణం పట్ల అమెరికా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+