స్వయానా ట్రంప్ నోట
ఇరాన్ తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వార్ మోడ్ లోకి వెళ్లింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్‌లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్ వాణిజ్య జీవనరేఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ ప్రతిరోజూ 435 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.4,000 కోట్లకు పైమాటే. ఇటువంటి ఆర్థిక నష్టం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ తో యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకుందని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చలు స్తంభించిన తర్వాత రెండో దఫా కూడా అవకాశం ఉందనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఈ యుద్ధం దాదాపు ముగిసిందని భావిస్తున్నట్లు చెప్పారు. ముగింపునకు అతి సమీపంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మకంగా అత్యంత పటిష్టంగా ఉన్నామని, ఈ స్థితిలో ఇరాన్ కు మరో గత్యంతరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు తాను అన్నింటిని ఉపసంహరించుకుని, యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టినా కూడా పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ కు 20 సంవత్సరాలు పడుతుందని అన్నారు. తమ పని ఇంకా పూర్తి కాలేదని, మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు.
తమతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో తదుపరి చర్చలు జరిగే అవకాశాలు లేకపోలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యుద్ధం ప్రారంభం కాకముందు నుంచీ దౌత్య చర్చలకు నాయకత్వం వహించిన ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. మలి విడత సమావేశాలకు ప్రాతినిథ్యాన్ని వహించవచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. చర్చల బాధ్యతను ట్రంప్ తన ముగ్గురు సీనియర్ సలహాదారులకు అప్పగించారని తెలిపింది.
-
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
గల్ఫ్ లో భారత్ భారీ రెస్క్యూ ఆపరేషన్ -
వామ్మో.. నిమిషాల్లోనే రూ. 8 లక్షల కోట్లు హాంఫట్..












Click it and Unblock the Notifications