ట్రంప్ కు ప్రాణహాని ? సొంతిట్లోనే సన్ బాత్ లో డ్రోన్ అటాక్..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత అందరికీ టార్గెట్ అవుతున్నారా ? విదేశాలతో పాటు స్వదేశంలోనూ ఆయనకు శత్రువులు ఎక్కువవుతున్నారా ? త్వరలో ఆయన్ను మట్టుపెట్టేందుకు రంగం సిద్దమవుతోందా ? అదీ ఆయన అధికారిక నివాసం మార్-ఏ-లోగోలోనే ఆయన హత్య చేయబడతారా ? అంటే అవుననే అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనీ ప్రధాన సలహాదారు జావెద్ లారిజానీ..
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం జరగడానికి కారణమై, మధ్యలో ఇరాన్ పై దాడులు చేసి, చివరికి రెండు దేశాల మధ్య సంధి కుదిర్చినట్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ పలు దేశాలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ కు ప్రాణహాని ఉందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనీ సలహాదారు జావెద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫ్లోరిడా నివాసం మార్-ఎ-లాగోలో ఇకపై సురక్షితంగా ఉండలేరంటూ ఇరాన్ సీనియర్ అధికారి చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా సన్ బాత్ చేస్తున్నప్పుడు ఆయన్ను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారి హెచ్చరించారు. ట్రంప్ చర్యలు ఆయన్ను ఓ ప్రముఖ వ్యక్తిగా మార్చాయని ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీ నివేదించింది.

ఎండలో పడుకుని ఉన్నప్పుడు ఒక చిన్న డ్రోన్ ద్వారా అమెరికా అధ్యక్షుడిని హతమార్చడం చాలా సులభం అని ఇరాన్ లీడర్ సలహాదారు జావెద్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మార్-ఎ-లాగోలో ఇకపై సన్ బాత్ చేయలేరని కూడా ఆయన చెప్పేశారు. ట్రంప్ ఎండలో పడుకున్నప్పుడు ఓ చిన్న డ్రోన్ అతని కడుపును తాకవచ్చని, ఇది చాలా సులభమని ఇరాన్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ లో ట్రంప్ పై కొందరు బౌంటీని ప్రకటించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన తర్వాత సదరు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం











Click it and Unblock the Notifications