అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ రద్దు? ట్రంప్ పెను సంచలనం..!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ఫస్ట్ నినాదంతో పాలిస్తానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మరో సంచలనానికి తెరదీశారు. త్వరలో దేశంలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించారు.

ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. దీని స్ధానంలో ఏ చేయబోతున్నారో కూడా అమెరికన్లకు చెప్పేశారు. దీంతో ట్రంప్ నిర్ణయాలు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Donald trump to remove income tax in US soon likely to replace with additional tariffs

అమెరికా పౌరులకు ప్రస్తుతం విధిస్తున్న ఆదాయపు పన్నును తొలగించబోతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చేశారు. వ్యక్తులు, కుటుంబాల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. తమను ధనవంతులుగా చేసిన అమెరికాను పునరుద్ధరించే దిశగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా ఆర్ధిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేసి, దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా ఈ లోటు పూడ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.

విదేశాలను సుసంపన్నం చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు, మన పౌరులను సుసంపన్నం చేయడానికి విదేశీ దేశాలపై పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు హౌస్ రిపబ్లికన్ సభ్యుల కాన్ఫరెన్స్‌లో తన పన్ను సంస్కరణ ప్రణాళికలను బయటపెట్టారు. 1870 నుండి 1913 వరకు అమెరికా చరిత్రలో అత్యంత సంపన్నమైనదని, సుంకం ఆధారిత ఆర్థిక వ్యవస్థ అమలులో ఉందని ట్రంప్ గుర్తుచేశారు. ఆ కాలంలో దిగుమతి సుంకాల ద్వారా దేశం భారీ ఆదాయాన్ని సంపాదించిందని తెలిపారు.

అలాగే అమెరికాలో బహుముఖ పన్నుల తగ్గింపుల కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదిత తగ్గింపుల నుండి రాబడి లోటును భర్తీ చేయడానికి దిగుమతి సుంకాలను వాడుకోవాలని భావిస్తున్నారు. అలాగే దిగుమతి సుంకాల నిర్వహణను పర్యవేక్షించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కార్మికులు, కుటుంబాలను రక్షించడానికి వాణిజ్య వ్యవస్థ సమగ్రతను వెంటనే ప్రారంభిస్తునట్లు ప్రమాణస్వీకార ప్రసంగంలో ట్రంప్ తెలిపారు. ఆర్థికవేత్తలు మాత్రం ట్రంప్ ప్రణాళికలు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+