పాకిస్తాన్ నుంచి భారత్ పెట్రోల్ కొనేలా చేస్తా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్‌లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్‌ భారత్‌ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ పై విధించాల్సిన టారిఫ్ ను దాదాపుగా ఫైనల్ చేస్తోంది అమెరికా. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్‌ పై 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తుది దశకు చేరుకున్నాయని అన్నారు.

Donald Trump trade deal and oil partnership with Pakistan

ఈ సందర్భంగా పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్‌తో నూతన చమురు వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి భారత్ ముడిచమురును కొనుగోలు చేసేలా తయారు చేస్తామని, ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని అన్నారు.

పాకిస్తాన్ తో ఆయిల్ ట్రేడ్ డీలింగ్స్ ను నడిపించడానికి ప్రత్యేకంగా ఓ సంస్థను ఎంపిక చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ ను విధించిన కొన్ని గంటలకే- పాకిస్తాన్‌లోని చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో ఒక కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఇది భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ చమురు ఎగుమతి చేయడానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆయిల్ ట్రేడ్ డీల ద్వారా పాకిస్తాన్- అమెరికా కలిసి అక్కడి ఆయిల్ రిజర్వ్స్ ను అభివృద్ధి చేస్తాయని అన్నారు. ఏదో ఒకరోజు పాకిస్తాన్.. భారత్ కు ఆయిల్ అమ్మే పరిస్థితి రావొచ్చని చెప్పారు.

రష్యాతో భారత్ క్రమం తప్పకుండా క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోండటం.. సత్సంబంధాలను కొనసాగిస్తోండటం, ఇతర వాణిజ్య కార్యకలాపాల వల్లే ఆగస్టు 1 నుండి భారతీయ దిగుమతులపై 25 శాతం టారిఫ్, అదనపు జరిమానాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ట్రేడ్ డీల్ గురించి ఆ దేశ మంత్రులతో సమావేశం అయ్యారు. వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు అమెరికాకు అన్ని విధాలుగా సహకారం అందించినట్లు చెప్పారు. ట్రేడ్ డీల్ కుదరబోతోన్నట్లు వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+