Donald Trump : మళ్లీ గెలిస్తే భారత్ పై ఎదురు పన్నులు..! డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత ప్రధాన నరేంద్రమోడీతో కలిసి ఉమ్మడిగా ఈవెంట్లు పెట్టి మరీ హంగామా చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మన దేశంపై అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యంగా భారత్ లో అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అధిక పన్నులపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిని అయితే భారత్ పై అదే స్ధాయిలో ఎదురు పన్నులు విధిస్తాననని ట్రంప్ హెచ్చరించారు.

భారత్ లో అమెరికాకు చెందిన ప్రీమియం హార్లీ-డేవిడ్ సన్ బైక్స్ పై భారీ స్ధాయిలో పన్ను విధిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మా దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్ లో అధిక పన్నులు విధిస్తున్నారని, తాను తిరిగి 2024లో అధికారంలోకి వస్తే వారిపై అంతే స్ధాయిలో ఎదురు పన్నులు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. తద్వారా మరోసారి అమెరికన్లలో జాతీయ భావాన్ని రెచ్చగొట్టేందుుక ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Donald Trump warns india to slap reciprocal taxes if he comes again in 2024

అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి పనిచేసిన కాలంలో ట్రంప్ భారత్ ను పన్నుల కింగ్ గా అభివర్ణించారు. 2019లో ఓడిన సమయంలోనూ భారత్ తమకు ఆశించిన స్ధాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. యూఎస్ ఉత్పత్తులకు హేతుబద్ధమైన మార్కెట్ యాక్సెస్ ఇవ్వట్లేదని భారత్ ను విమర్శించారు. మరోవైపు ప్రస్తుతం వరుస కోర్టు కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. వీటి నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా హార్లీ డేవిడ్ సన్ బైకులపై భారత్ విధిస్తున్న పన్నులను ప్రస్తావిస్తూ.. వాళ్ల ఉత్పత్తులు అమెరికాలో పన్ను లేకుండా అమ్ముకునేందుకు అవకాశం ఉందని, కానీ భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై పన్నులు విధిస్తోందన్నారు.
ఇదే కొనసాగితే తాను తిరిగి అధికారంలోకి రాగానే అంతే స్ధాయిలో వారి ఉత్పత్తులపై పన్నులు విధించనున్నట్లు ప్రకటించారు. దీంతో ట్రంప్ ఈసారి భారత్ వ్యతిరేక అజెండాతో పాటు జాతీయ భావాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+