ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా దూకుడుకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియాపై విరుచుకుపడ్డారు.
తన తీరు మార్చుకోని ఉత్తరకొరియా మరోసారి న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ లు నిర్వహించిన విషయంపై ఇప్పటికే రష్యా, జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి తీవ్ర చర్యలు ఉత్తర కొరియాను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేస్తాయని ట్రంప్ చెప్పారు
. ఆ దేశం పంపుతున్న సంకేతాలను ప్రపంచం గమనిస్తోందని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని ధిక్కరించేలా ఉత్తరకొరియా చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
జపాన్ ప్రధాని షింజో అబేతో డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాట్లాడారు. ఉత్తర కొరియా చర్యలు ప్రపంచానికి ప్రమాదకరమని ఇరు దేశాల అగ్రనేతలు అభిప్రాయపడినట్టు శ్వేతసౌధం తెలిపింది.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications