వలసదారులకు నరకం చూపిస్తున్న ట్రంప్-బేడీలతో నీళ్లు, ఏసీ లేని విమానాల్లో..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వలసలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాగానే అన్నంతపనీ చేస్తున్నారు. అదీ అత్యంత దారుణంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.
మానవ హక్కుల్ని కాపాడే విషయంలో పెద్దన్నగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశం నుంచి వలసల్ని తరిమేసే విషయంలో ట్రంప్ ప్రభుత్వ వ్యవహారశైలి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

🇧🇷🇺🇸 | Brazil condemned the use of handcuffs on deportees as disrespectful after an unexpected landing in Manaus.
— UHN Plus – In English (@UHN_Plus_Eng) January 26, 2025
The Trump administration defended it as a security protocol and has no plans to change it. pic.twitter.com/UtSVR7sDVo
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్.. ఆ తర్వాత మూడు రోజుల్లోనే వలసల్ని గుర్తించి తరిమేయడం ప్రారంభించారు. వేల సంఖ్యలో వలసదారుల్ని అరెస్టులు చేయడంతో పాటు వారిని ప్రత్యేక ఆర్మీ విమానాల్లో ఎక్కించి మరీ దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అవమానవీయంగా ఉందని బ్రెజిల్ తాజాగా ఆరోపించింది.
బ్రెజిల్ కు చెందిన వలసదారుల్ని తాజాగా అమెరికా నుంచి బహిష్కరణ చేసే క్రమంలో వారి చేతులకు బేడీలు వేసి, ఏసీ, నీరు కూడా అందుబాటులో లేని విమానాల్లో ఎక్కించి పంపుతున్నారని ఆరోపించింది. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆరోపించింది. అక్రమ వలసదారులైనంత మాత్రాన ఇంత దారుణంగా, అవమానవీయంగా వ్యవహరించాలా అని ప్రశ్నిస్తోంది. ఓ విమానం బ్రెజిల్ ఉత్తర నగరమైన మనౌస్‌లో ల్యాండ్ అయినప్పుడు ఈ దృశ్యాలు కనిపించాయి. విమానంలోని 88 మంది బ్రెజిలియన్లు చేతికి సంకెళ్లతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే వారి చేతులకు చేతి సంకెళ్ళను తొలగించాలని బ్రెజిల్ న్యాయశాఖ అమెరికా అధికారుల్ని ఆదేశించింది.
మరోవైపు ఇలా అమెరికా నుంచి వలసల బహిష్కరణ విమానాలను తిరస్కరించినందుకు డొనాల్డ్ ట్రంప్ కొలంబియాపై ఆంక్షలు విధించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అణిచివేతలో భాగంగా బహిష్కరణకు గురైన వలసదారులతో కొలంబియాకు వచ్చిన రెండు యూఎస్ సైనిక విమానాలను ఆ దేశం తిప్పిపంపింది. కొలంబియాపై సుంకాలు, ఆంక్షలు, ప్రయాణ నిషేధాలతో సహా అన్ని ఆంక్షలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తద్వారా ఇలా తమ దేశాలకు చెందిన వలసదారుల్ని ఆహ్వానించేందుకు నిరాకరించే దేశాలన్నింటికీ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications