8.1 తీవ్రతతో భూకంపం: అంటార్కిటికా మంచు ఫలాకాల్లో భారీ చీలిక

దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం అంటార్కిటికాపై తీవ్రంగా పడింది. అక్కడి మంచు ఫలకాలు కదలిపోయాయి. డ్రెక్ ప్యాసేజ్ అల్లకల్లోలానికి గురైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అమెరికాలోని చిలీలో పలు నివాసాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది.

దక్షిణ అమెరికా- అంటార్కిటికా మధ్య చిలీ సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 2:16 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. అర్జెంటీనా సదరన్ సిటీ ఉషుయ్ కు దక్షిణ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.

Drake Passage hit by powerful tremor after Earthquake between South America and Antarctica

ఈ భూకంపం ధాటికి 7.5 తీవ్రతతో డ్రెక్ ప్యాసేజ్ కంపించింది. దక్షిణ అమెరికా- అంటార్కిటిక్ ద్వీపకల్పం మధ్య ఉన్న కీలక ప్రాంతం ఇది. డ్రేక్ పాసేజ్ దక్షిణ అమెరికా భూభాగానికి దగ్గరగా ఉండటం, దాని టెక్టోనిక్ ప్లేట్ల నిర్మాణం కారణంగా సునామీ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

డ్రేక్ పాసేజ్ అంటే ఏమిటి? ఎక్కడ ఉంది?

డ్రేక్ పాసేజ్.. సుమారు 800 నుండి 1,000 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సముద్ర మార్గం. చిలీలోని కేప్ హార్న్, అంటార్కిటికా సమీపంలోని సౌత్ షెట్లాండ్ దీవుల మధ్య ఉంటుంది. ఈ సీ రూట్.. నైరుతి అట్లాంటిక్ మహాసముద్రంతో ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.

అంటార్కిటికా వెళ్లడానికి ఇదే ప్రధాన సముద్ర మార్గం. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అంటార్కిటిక్ సర్కమ్‌ పోలార్ కరెంట్ (ACC) ఇక్కడి నుంచే ప్రవహిస్తుంది. భౌగోళికంగా- డ్రేక్ పాసేజ్ వాతావరణ మార్పులు- నియంత్రణ, సముద్ర జీవ వైవిధ్యానికి అత్యంత కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తుంటారు.

వివిధ ఖండాలు, అంటార్కిటికా మధ్య గాలుల వల్ల ఏర్పడే ఫన్నెలింగ్ ప్రభావం కారణంగా ఇక్కడి సముద్ర జలాలు ఎప్పుడూ అల్లకల్లోలానికి గురవుతుంటనే ఉంటాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కో కెరటం గరిష్ఠంగా 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతుంటుంది.

అలాంటి ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూకంప కేంద్రం ఈ డ్రేక్ పాసేజ్ సముద్రతీరం పరిదిలో ఉండటం మరింత ప్రమాదకరమని భావిస్తోన్నారు. దక్షిణ అమెరికా- అంటార్కిటికా టోక్టోనిక్ ప్లేట్ల పరస్పరం సంఘర్షణ కారణంగానే ఈ డ్రేక్ పాసేజ్‌ ఏర్పడినట్లు సైంటిస్టులు వెల్లడించారు.

దక్షిణ అమెరికా నుండి అంటార్కిటికా ప్రత్యేకంగా ఖండంగా విడిపోవడానికీ ఇలాంటి భూకంపాలే కారణమని అంచనా వేశారు. ఇక్కడి సముద్రం సగటు లోతు 15,600ల అడుగులకు పైగా ఉంటుంది. డ్రేక్ పాసేజ్ అల్లకల్లోలంగా ఉండటం వల్ల ఈ మార్గంలో నౌకల రాకపోకలు తక్కువగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+