మరోసారి గొప్ప మనసు చాటుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం తన దాతృత్వంతో మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఇటీవల దుబాయ్‌లోని ప్రముఖ మాల్‌లో ఉన్న 'లా మైసన్ అనీ' అనే రెస్టారెంట్‌ను తన స్నేహితులతో కలిసి ఆయన సందర్శించారు. ఆ సమయంలో అక్కడ భోజనం చేస్తున్న వారందరి బిల్లు కూడా చెల్లించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఫుల్ వైరక అవుతోంది. దీంతో ప్రిన్స్ చేసిన సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లందరి బిల్లు సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ - షేక్ హమ్దాన్ స్వయంగా చెల్లించారట. ఒక మహిళ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. "ఆయన రాక మా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆయన మా అందరి బిల్లులు చెల్లించారని తెలిసి మనసు తడిసి ముద్దయింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ - ఇది నిజంగా రాజరికానికి అర్థం చెప్పే చర్య అని పొగడ్తలతో సోషల్ మీడియా నిండిపోయింది.

షేక్ హమ్దాన్ సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, దాతృత్వ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటారు. అనాథలు, వృద్ధులు, వికలాంగులు, తక్కువ ఆదాయ కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతే కాకుండా కవిత్వం, ఫొటోగ్రఫీ, సాహస క్రీడలు షేక్ హమ్దాన్‌కు ఎంతో ఇష్టమైనవి. యువతలో సామాజిక బాధ్యతను కలిగించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటారు.
-
ఈ గ్రూపు ఫోటోలో ఉన్న మంత్రగత్తెని కనిపెట్టగలరా..? -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ షాక్.. -
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications