మరో పెను భూకంపం: సునామీ భయాలు..!!

గాబ్రియెల్ తుఫాన్.. న్యూజిలాండ్ ను అల్లకల్లోలానికి గురి చేస్తోంది. ఈ తుఫాన్ ధాటికి ఉత్తర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా పెను భూకంపం ఈ ద్వీప దేశాన్ని వణికించింది.

క్రైస్ట్ చర్చ్: టర్కీ, సిరియాల్లో వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న పెను భూకంపాలు ఇంకా వదలట్లేదు. టర్కీలో సంభవించిన వరుస భూకంపాల్లో 35,000 మందికి పైగా మరణించారు. భవన శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే వస్తోన్నాయి. మృతుల సంఖ్య కనీసం 50,000 చేరుకోచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. సిరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారత్ సహా వివిధ దేశాల నుంచి టర్కీ వెళ్లిన బృందాలు సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొంటోన్నాయి.

ఇదిలా కొనసాగుతుండగానే.. మరో పెను భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ ను వణికించింది. సునామీ భయాలను పుట్టించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా రికార్డయింది. న్యూజిలాండ్ నార్త్ ఐలండ్ లోని అతిపెద్ద నగరం అక్లాండ్ కు 1,034 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 2:48 నిమిషాలకు సంభవించినట్లు పేర్కొంది.

దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలానికి గురవుతోంది..అతలాకుతలమౌతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ద్వీప దేశాన్ని ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురు గాలుల ప్రభావానికి చివురుటాకులా వణికిపోతోంది. అక్లాండ్ సహా పలు నగరాల తుఫాన్ బారిన పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా పలు చర్యలు తీసుకుంది.

Earthquake hits Newzealand: Strong magnitude 6.2 recorded on Richter scale

ఈ తుఫాన్ పేరు గాబ్రియెల్లె. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో ఏర్పడింది. నార్త్ ఐలండ్ లోని అతి పెద్ద నగరం అక్లాండ్ వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాన్ తీరానికి తాకిన సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు రేడియో న్యూజిలాండ్ (ఆర్ఎన్‌జెడ్) తెలిపింది. సౌత్ ఐలండ్ పైనా దీని ప్రభావం కనిపించింది. వెల్లింగ్టన్, క్రైస్ట్ చర్చ్ సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అక్లాండ్ కు విమాన సర్వీసులను రద్దు చేశారు. అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలు రద్దయ్యాయి. న్యూజిలాండ్ నార్త్ ఐలండ్ లోని తీర ప్రాంత నగరాలు కోరమాండల్, గిస్‌ బోర్నె, విటియంగా, కువాటును, వైటై బే, ఒపిటో బే అల్లకల్లోలానికి గురయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+