Earthquake: ఇరాన్‌లో భూకంపం.. కారణం అదేనా?

Earthquake: శుక్రవారం(జూన్ 20న) ఉత్తర ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. సెమ్నాన్‌కు 27 కిలోమీటర్ల నైరుతి దిశలో ఈ భూకంపం వచ్చింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో భూకేంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధాన్ని పరీక్షించిందా అనే ఊహాగానాలకు దారి తీసింది. ఇది ఒక అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలో సంభవించడంతో ఆందోళనలను రేకెత్తించింది. ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న సెమ్నాన్ స్పేస్ సెంటర్, సెమ్నాన్ మిస్సైల్ కాంప్లెక్స్ అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ న్యూస్ ఏజెన్సీ IRNA ప్రకారం.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, "తక్కువ నష్టం" మాత్రమే జరిగిందని తెలిపింది. అరబియన్, యూరేసియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలుసుకునే ఆల్పైన్-హిమాలయ్ సిస్మిక్ బెల్ట్ వెంట దాని స్థానం కారణంగా సంఘర్షణలతో కూడిన ఈ దేశం ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల దేశాలలో ఒకటి.ఇరాన్‌లో సాధారణంగా సంవత్సరానికి 2,100 భూకంపాలు సంభవిస్తాయి. వాటిలో 15 నుండి 16 భూకంపాలు 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. 2006- 2015 మధ్య, ఈ దేశంలో 96,000 భూకంపాలు సంభవించాయి.

Earthquake in Iran Natural Tremor or Nuclear Test Rumor

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేసుకున్నాయి. రెండు దేశాల్లో మిస్సైళ్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోవని ఇరాన్ పేర్కొంది. దాడుల సమయంలో అణు కార్యక్రమంపై చర్చించలేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్‌తో సుదీర్ఘ పోరు తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ విషయాన్ని పేర్కొంది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తోంది.

భూకంపం సహజసిద్ధమైనదేనా?
అణు కార్యకలాపాల సమయంలో భూగర్భ పేలుళ్లు సమీపంలోని టెక్టోనిక్ ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా భూకంపాలను ప్రేరేపించగలవు. అయితే, భూకంప శాస్త్రవేత్తలు భూకంప తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా పేలుళ్లు, సహజ భూకంపాల మధ్య తేడాను గుర్తించగలరు. సీస్మిక్ డేటా ప్రకారం ఈ భూకంపం సహజసిద్ధమైనదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+