రష్యా తీరంలో మళ్లీ భారీ భూకంపం

Russia Earthquake 2025: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న 8.8 తీవత్రతో సంభవించిన భూకంపంతో ఊగిపోయింది రష్యా. సునామీకి కారణమైంది. జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ సహా పలు పసిఫిక్ తీర ప్రాంత దేశాలు భయంకపితులయ్యాయి. కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం కనిపించింది. రాకాసి అలలు జపాన్ ను కంటి మీద కునుకు లేకుండా చేశాయి.

Earthquake Magnitude 6 2 on richter scale joltsKuril Islands

ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రష్యాలోని కురిల్ దీవుల తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 నమోదైంది. సెంటర్ ఫర్ నేషనల్ సెస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. రాత్రి 11:50 నిమిషాలకు 50.19 ఉత్తర అక్షాంశం, 159.14 తూర్పు రేఖాంశం వద్ద భూమి ప్రకోపించింది.

పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ద్వీప సముదాయం ఇది. క్రియాశీలక అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. 20 నుంచి 25 వేల వరకు జనాభా ఉంటుందిక్కడ. డిస్ప్యూటెడ్ ఐలండ్స్ లల్లో ఇదీ ఒకటి. రష్యా, జపాన్ దీన్ని తమదిగా చెప్పుకొంటోన్నాయి. రష్యా సఖాలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

తాజాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. తొలుత సునామీ సంభవించే ప్రమాదం ఉండొచ్చని వార్తలొచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నరు.

కాగా- రష్యా తీరంలో 8.8 తీవ్రత భూకంపం తర్వాత 16 గంటల్లో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు దాదాపుగా 125 వరకు చోటు చేసుకున్నాయి. వీటిలో మూడు ప్రకంపనలు 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కురిల్ ఐలండ్స్ లో వచ్చిన భూకంపం కూడా అలాంటిదేనని అంచనా వేస్తోన్నారు.

సాధారణంగా, ప్రధాన భూకంపం సంభవించిన తొలి కొన్ని గంటలు లేదా రోజుల పాటు ప్రకంపనలు తీవ్రంగా ఉంటాయి. అధిక సంఖ్యలో సంభవిస్తుంటాయి. లోతుగా సంభవించే భూకంపాల కంటే తక్కువ లోతులో అంటే షాలో భూకంపాలు మరింత ప్రమాదకరమైనవిగా భావిస్తుంటారు.

దీనికి కారణం.. లోతు తక్కువగా ఉండటం వల్ల భూకంపాల నుండి వచ్చే తరంగాలు భూమి ఉపరితలానికి వేగంగా చేరుకోవడమే. దీనివల్ల భూమి తీవ్రంగా కంపిస్తుంది. అలాంటప్పుడే కట్టడాలకు గణనీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫలితంగా ప్రాణనష్టం సంభవిస్తుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+