అసాధారణ భూకంపం- ఉప్పొంగిన కడలి
Caribbean Sea Earthquake: కరేబియన్ సముద్రంలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత అసాధారణంగా నమోదు కావడం వల్ల సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప ప్రభావం ఆరు దేశాలపై పడింది. తీర ప్రాంతాలు పోటెత్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా రికార్డయింది. హోండూరస్‌కు ఉత్తరదిశగా 32 కిలోమీటర్లు, కేమన్ ఐలండ్స్‌కు నైరుతి దిశగా 209 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.

సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. భూకంపం తీవ్రత అసాధారణంగా ఉండటం వల్ల నేషనల్ వెదర్ సర్వీస్- సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ప్యూర్టోరికో, యూఎస్ విర్జిన్ ఐలండ్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆ ప్రభావం కనిపించకపోవడంతో 45 నిమిషాల తరువాత వీటిని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ- అలల తాకిడి కొన్ని గంటల పాటు కొనసాగుతుందని హవాయ్‌లోని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.
ఈ భూకంప ప్రభావం పలు దేశాలపై పడింది. జమైకా, మెక్సికో, టర్క్స్, కైకోస్, శాన్ ఆండ్రెస్ ప్రావిడెన్స్, డొమినిక్ రిపబ్లిక్, కొలంబియా, పనామా, కేమన్ ఐలండ్స్, కోస్టారికా, హోండూరస్, అరుబా, నికరగ్వా, క్యూబా, బొనైర్‌పై తీవ్రంగా పడింది. ఆయా దేశాల తీర ప్రాంతాలన్నీ పోటెత్తాయి. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు స్థానిక అధికారులు.












Click it and Unblock the Notifications