అమెరికాను వణికించిన భూకంపం- రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు

అగ్రరాజ్యం అమెరికాను భారీ భూకంపం వణికించింది. తీర ప్రాంత రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. కొన్ని చోట్ల పాక్షికంగా భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. భూకంపం ధాటికి స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు.

కాలిఫోర్నియాలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా రికార్డయింది. ఇండీయో హిల్స్‌కు ఈశాన్యంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఆ దేశ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5:56 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటుచేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకోపించింది.

Earthquake today Magnitude 5 1 jolts California

ఇది షాలో ఎర్త్ క్వెక్. తక్కువ లోతులో చోటుచేసుకోవడంతో ఈ ప్రకంపనలు పామ్ స్ప్రింగ్స్ నుండి శాన్ డియాగో వరకు విస్తృతంగా విస్తరించాయి. ఈ ప్రకంపనల తీవ్రత కోచెల్లా వ్యాలీ నుండి శాన్ బెర్నార్డినో కౌంటీ వరకు కనిపించాయి. మొబైల్ యుటిలిటీలు, రోడ్లకు ఎటువంటి డ్యామేజీ సంభవించలేదని రివర్‌సైడ్ కౌంటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ సిస్టమ్‌కు భూకంప కేంద్రం సమీపంలో ఉండటమే దీని తీవ్రతకు కారణం.

మై షేక్ వంటి యాప్‌లు దక్షిణ కాలిఫోర్నియా ప్రజలకు కొన్ని సెకన్ల ముందే హెచ్చరికలు చేరవేశాయి. ఈ జనవరిలో ఈ ప్రాంతంలో 3.3 తీవ్రత వరకు 300కు పైగా ప్రకంపనలు నమోదయ్యాయి. 2.5 నుండి 5.4 తీవ్రత కలిగిన భూకంపాలు అరుదుగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇండీయో, కోచెల్లా, లా క్వింటా నివాసితులు భూకంప కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర ప్రభావాలను చవి చూశారు. కేథడ్రల్ సిటీ, పామ్ డెజర్ట్, బిగ్ బేర్, శాన్ డియాగో, లాస్ ఏంజిల్స్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. కాలిఫోర్నియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండటం వల్ల ఏటా సుమారు 5,00,000 వరకు తేలికపాటి భూప్రకంపనలు సంభవిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+