ఆఫ్ఘనిస్తాన్ లో బీభత్సం
Afghanistan earthquake: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించాయి. తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పాకిస్తాన్, తజకిస్తాన్ లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి నలుగురు దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైగా గాయపడ్డారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో గత కొన్ని రోజుల్లో భూమి వరుసగా ప్రకంపిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అయిదు గంటల వ్యవధిలో ఇవి సంభవించడం, అది కూడా ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఇవి నమోదు అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా భూకంపా తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9, 6.3గా రికార్డయింది. తొలి భూకంపం ఆదివారం రాత్రి 8:40 నిమిషాలకు సంభవించింది. దీని తీవ్రత స్వల్పమే కావడం వల్ల పెద్దగా ప్రభావం చూపలేదు.

రెండోది- అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 12:59 నిమిషాలకు 36.50 నార్త్ అక్షాంశం, 67.50 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం మజార్-ఎ- షరీఫ్ సమీపంలో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత అధికం. 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇది. ఉపరితలం నుంచి 23 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
మజార్-ఎ షరీఫ్.. సుమారు 5,23,000 మంది నివసించే సిటీ. ప్రాణనష్టం కూడా ఇక్కడే సంభవించింది. సమంగాన్, మజార్, నౌషాద్, తష్కుర్ఘాన్, ఖుల్మ్ అని ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. కాబూల్-మజార్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. తష్కుర్ఘాన్‌లో పలు వ్యాపార సముదాయాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద చిక్కుకుని నలుగురు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రాంప్ట్ అసెస్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్‌క్వేక్స్ ఫర్ రెస్పాన్స్ సిస్టమ్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
A powerful earthquake struck northern Afghanistan in the middle of the night, causing houses to collapse while residents were deeply asleep, resulting in numerous fatalities. pic.twitter.com/t4x6dNmwdQ
— Nilofar Ayoubi 🇦🇫 (@NilofarAyoubi) November 2, 2025
దీని తీవ్రత పలు ప్రావిన్సుల్లో కనిపించింది. రాజధాని కాబూల్ పైనా దీని ప్రభావం పడింది. పలు నివాసాలు బీటలు వారాయి. మరికొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఆగస్టులో సంభవించిన వినాశకరమైన భూకంపం 2,200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొన్ని నెలలకే తాజా ప్రకంపనలు సంభవించాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications